Samsung Galaxy A12 కొత్త స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ప్రారంభం!! ఊహించని ఆఫర్స్...

|

ప్రముఖ శామ్‌సంగ్ కంపెనీ తన యొక్క గెలాక్సీ A-సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడల్‌ శామ్‌సంగ్ గెలాక్సీ A12 ను భారతదేశంలో విడుదల చేసారు.గెలాక్సీ A11 కు అప్ డేట్ వెర్షన్ గా వచ్చిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. క్వాడ్ రియర్ కెమెరా, 15W ఫాస్ట్ ఛార్జింగ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్ప్లే వంటి ఫీచర్లతో లభిస్తూ రెడ్‌మి నోట్ 9 ప్రో, రియల్‌మి 7, ఒప్పో A52 వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తున్న ఈ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A12 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A12 ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 వద్ద ఉండగా, 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.13,999. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీనిని ఈ రోజు అంటే ఫిబ్రవరి 17 నుండి అన్ని రిటైల్ దుకాణాలు, శామ్‌సంగ్.కామ్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A12 లాంచ్ ఆఫర్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ A12 లాంచ్ ఆఫర్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి లాంచ్ ఆఫర్‌లలో భాగంగా జియో కస్టమర్లకు రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జిపై రూ.3,000 వరకు మరియు ఇతర భాగస్వాముల నుండి రూ.4000 విలువైన వోచర్లు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త మరియు ఇప్పటికే ఉన్న జియో చందాదారులకు వర్తిస్తుంది. గెలాక్సీ A12 ను కొనుగోలు చేసిన Vi కస్టమర్లకు రూ.299 రీఛార్జ్ మీద మొదటి మూడు నెలలు డబుల్ డేటా ప్రయోజనం లభిస్తుంది. ఈ ఫోన్ ను జీరో డౌన్-పేమెంట్ EMI ఆఫర్లతో కూడా అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో వన్ UI కోర్ 2.5 తో రన్ అవుతుంది. ఇది 720x1,600 పిక్సెల్స్ మరియు 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoC తో శక్తిని పొందుతూ 4GB RAM తో జతచేయబడి ఉంటుంది.

కెమెరా సెటప్‌

శామ్‌సంగ్ గెలాక్సీ A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరా సెటప్‌ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.0 లెన్స్ తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

స్టోరేజ్

ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ A12 లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఫోన్ లో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి వీలుగా ఉంది. ఈ ఫోన్‌లో 4G LTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A12 New Smartphone First Online Sale Starts Today in India: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X