Home
News

Samsung Galaxy F62 ఫోన్ లాంచ్ అయింది!! అందుబాటు ధరలోనే...

ఇండియాలో గత ఏడాది అక్టోబర్‌లో గెలాక్సీ F41 లాంచ్‌తో శామ్‌సంగ్ సంస్థ F-సిరీస్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. దీని కొనసాగింపుగా కంపెనీ తన సరికొత్త మోడల్‌ శామ్‌సంగ్ గెలాక్సీ F62 ను లైవ్ స్ట్రీమ్ ద్వారా విడుదల చేసారు. ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉండి ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9825 SoC వంటి ఫీచర్లను కలిగి ఉంది. 7,000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ మరియు సరికొత్త వన్ UI3.1 ఫీచర్లతో వస్తూ వన్‌ప్లస్ నార్డ్, రియల్‌మి X3 సూపర్‌జూమ్, రియల్‌మి X7 5G వంటి వాటికి పోటీగా లభించే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F62 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ F62 ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ F62 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ యొక్క ధర రూ.23,999 ఉండగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.25,999 గా ఉంది. ఈ ఫోన్ లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్ మరియు లేజర్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, జియో రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి ఫిబ్రవరి 22, మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F62 లాంచ్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F62 లాంచ్ ఆఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ F62 ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్లలో భాగంగా రీఛార్జ్ డిస్కౌంట్ కూపన్ల విభాగంలో ఇతరులకు రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే జియో కస్టమర్లకు 7,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను ప్రకటించారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌తో వస్తుంది. దీని కింద వినియోగదారులు దాని ధరలో 70 శాతం చెల్లించి గెలాక్సీ F62 ను పొందవచ్చు. ఒక సంవత్సరం తరువాత వినియోగదారులు సరికొత్త గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి పరికరాన్ని తిరిగి ఇవ్వడానికి లేదా 30 శాతం అసలు ధరను చెల్లించడం ద్వారా అదే ఫోన్ ను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు.

శామ్‌సంగ్ గెలాక్సీ F62 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F62 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ F62 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు వన్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 1080x2400 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది ఎక్సినోస్ 9825 SoC తో రన్ అవుతూ 8GB RAM తో జతచేయబడి వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F62 కెమెరా సెటప్ ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F62 కెమెరా సెటప్ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ F62 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ తో పాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 123-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 5 మెగాపిక్సెల్ స్థూల షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ముందు మరియు వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్ మద్దతుతో వస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ F62 కనెక్టివిటీ ఎంపికలు

శామ్‌సంగ్ గెలాక్సీ F62 కనెక్టివిటీ ఎంపికలు

శామ్‌సంగ్ గెలాక్సీ F62 ఫోన్ లో 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో గల మైక్రో ఎస్‌డి కార్డ్ 1TB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 7000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మొత్తం సామర్థ్యాన్ని పూరించడానికి రెండు గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది. ఈ బ్యాటరీ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F62 New Smartphone Released in India: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X