Home
News

శామ్‌సంగ్ గెలాక్సీ A31, A21s ఫోన్‌ల ధర మీద భారీ ధర తగ్గింపు!!!

భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద GST రేట్లను పెంచినప్పటి నుండి స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు అన్ని కూడా తమ ఫోన్‌ల యొక్క ధరలను పెంచాయి. శామ్‌సంగ్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరల పెరుగుదల ధోరణిలో రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది. ధర తగ్గింపు పొందిన రెండు స్మార్ట్‌ఫోన్‌లలో శామ్‌సంగ్ గెలాక్సీ A31 మరియు శామ్‌సంగ్ గెలాక్సీ A21s వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరల విషయానికి వస్తే దాని పాత MRP ధర కంటే రూ.1000 తక్కువగా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ A31 కొత్త ధర వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A31 కొత్త ధర వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.21,999 ధర వద్ద లాంచ్ చేశారు. ఇప్పుడు దీని మీద రూ.1,000 తగ్గింపు లభించడంతో రూ.20,999ల కొత్త ధర వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు.

 

శామ్సంగ్ గెలాక్సీ A21s  కొత్త ధర వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A21s కొత్త ధర వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A21s లను ఇండియాలో రెండు వేర్వేరు వేరియంట్లతో లాంచ్ చేశారు. ఇందులో ప్రస్తుతం 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే ధర తగ్గింపు లభించింది. ఈ ఫోన్ రూ.18,499 ధర వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు దాని మీద రూ.1000 తగ్గడంతో దీనిని రూ.17,499 కొత్త ధర వద్ద పొందవచ్చు.

Samsung Galaxy A21s ఫీచర్స్

Samsung Galaxy A21s ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను దీర్ఘచతురస్ర కారంలో ఉంటుంది. ఇందులో ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ లోపల 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉంటుంది.

Samsung Galaxy A21s స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A21s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 720 X 1,600 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI మరియు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ A31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ AMOLED ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లే 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంటుంది. అలాగే దీని డిస్ ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ65 ప్రాసెసర్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ A31 సాఫ్ట్‌వేర్

శాంసంగ్ గెలాక్సీ A31 సాఫ్ట్‌వేర్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్10- ఆధారిత OneUI అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇది డ్యూయల్ 4G Volte సిమ్ స్లాట్, వైఫై, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సామర్థ్యం గల 5000mAh బ్యాటరీ సపోర్ట్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A31, A21s Gets Price Discounts up to Rs.1000 in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X