Home
News

రూ.2000 భారీ తగ్గింపును పొందిన Galaxy A51,A71 స్మార్ట్‌ఫోన్‌లు!!!

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ ఇండియాలో కొత్త ఫోన్ ను విడుదల చేయడంతో పాటుగా గెలాక్సీ A71 మరియు గెలాక్సీ A51 యొక్క ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ సంస్థ ఈ రెండు ఫోన్‌ల ధరల మీద రూ.2,000 వరకు తగ్గించింది. రూ.23,999 ధర వద్ద గెలాక్సీ A51 బ్రాండ్ 2020 లో ఆఫ్‌లైన్ మార్కెట్లో లాంచ్ చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. అలాగే గెలాక్సీ A71 ను ఇప్పుడు రూ.27,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరలు ఇప్పటికే శామ్‌సంగ్ షాప్ ఆన్‌లైన్ మరియు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ లో ఈ రెండు మోడళ్ల మీద తగ్గింపు కొత్త ధరలు ఇంకా ప్రభావితం కాలేదు.

గెలాక్సీ A71, A51 స్మార్ట్‌ఫోన్‌ల తగ్గింపు కొత్త ధరలు

గెలాక్సీ A71, A51 స్మార్ట్‌ఫోన్‌ల తగ్గింపు కొత్త ధరలు

సింగిల్ వేరియంట్లో ఇంతకు మునుపు రూ.29,499 ధర వద్ద లభించే గెలాక్సీ A71 ను ఇప్పుడు రూ.27,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ A51 యొక్క 6GB ర్యామ్ మరియు 8GB ర్యామ్ రెండు వేరియంట్ల మీద కూడా తగ్గింపు లభించింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ఇప్పటివరకు రూ.22,999 ధర వద్ద లభించగా ఇప్పుడు దీని ధర రూ.20,999 కి పడిపోయింది. అలాగే రూ .24,499 ధర వద్ద లభించే 8 జీబీ ర్యామ్ -128 జీబీ మోడల్ ఇప్పుడు రూ.22,499 కి పడిపోయింది. ఇవి శాశ్వత ధరల తగ్గింపు.

శామ్‌సంగ్ గెలాక్సీ A51 ఎక్సినోస్ 9611 SoC

శామ్‌సంగ్ గెలాక్సీ A51 ఎక్సినోస్ 9611 SoC

శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 1080x2400 పిక్సెల్స్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC తో రన్ అవుతూ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ A51 క్వాడ్-కెమెరా ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A51 క్వాడ్-కెమెరా ఫీచర్స్

గెలాక్సీ A51 యొక్క కెమెరాల విషయానికొస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A51, Galaxy A71 Price Slashed in India 2021 : New Price, Specs, Sales Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X