Just In
- 7 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 10 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
- 10 hrs ago
'టెలిసాట్' అత్యంత వేగవంతమైన హైస్పీడ్ నెట్వర్క్! ఇక ఇంటర్నెట్ సమస్యలు ఉండవు!
- 12 hrs ago
ఇష్టం వచ్చినట్లు కంటెంట్ షేర్ చేస్తే ఇబ్బందులు తప్పవు..! కొత్త రూల్స్ ఇవే !
Don't Miss
- News
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న కన్నుమూత...
- Finance
అదిరిపోయే న్యూస్: రూ.45,766కు వచ్చిన బంగారం ధర, వెండి రూ.1600 డౌన్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Samsung Galaxy M02s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం..
2021 సంవత్సరం ప్రారంభంలో శామ్‌సంగ్ సంస్థ Mసిరీస్ లో భాగంగా కొత్త బడ్జెట్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ M02s పేరుతో లాంచ్ అయిన తాజా స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఆఫర్‌గా భారతదేశంలో విడుదల చేసింది. ఈ బడ్జెట్ హ్యాండ్‌సెట్ యొక్క ధర రూ.10,000 లోపు ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 SoC, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M02s ధరల వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ M02s స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరు వేరు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 9,999 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని యొక్క అమ్మకాలు అమెజాన్.ఇన్, శామ్సంగ్.కామ్ మరియు భారతదేశంలోని ముఖ్యమైన రిటైల్ దుకాణాల ద్వారా త్వరలోనే ప్రారంభం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ M02s స్నాప్‌డ్రాగన్ 450 స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ M02s స్మార్ట్‌ఫోన్ యొక్క కీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత శామ్‌సంగ్ వన్ UI ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ TFT LCD డిస్‌ప్లేను 720x1,560 పిక్సెల్స్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది అడ్రినో 506 GPU తో స్నాప్‌డ్రాగన్ 450 ఆక్టా-కోర్ SoC చేత రన్ అవుతూ 4GB వరకు ర్యామ్ మరియు 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డు మద్దతుతో మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M02s ట్రిపుల్ కెమెరా ఫీచర్స్
శామ్‌సంగ్ గెలాక్సీ M02s స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు నిలువ వరుసలో దీర్ఘచతుస్రాకార ఆకారంలో ప్యాక్ చేయబడి ఉంటాయి. అలాగే ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ISO కంట్రోల్, ఆటో ఫ్లాష్, డిజిటల్ జూమ్, హెచ్‌డిఆర్ మరియు ఎక్స్‌పోజర్ వంటి అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌తో అందించబడతాయి. చివరిగా ఇది 15W క్విక్ ఛార్జ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండి 9.1 మిమీ సన్నని నిర్మాణంతో 196 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190