Samsung and Xiaomi:Q1 2020 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో రికార్డు సేల్స్...
ప్రపంచం మొత్తం ప్రస్తుతం అన్ని రంగాలలోను వేగంగా పరుగులు తీస్తున్నది. టెక్నాలజీ విషయంలో కూడా రోజు రోజుకి మార్పులతో పాటుగా చాలా అడ్వాన్సుగా తమను తాము మార్చుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు.

ప్రపంచం మొత్తం మీద ఉన్న జనాభాలలో 100లో 60 మందికి పైగా ఫోన్లను వాడుతున్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రీమియం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదైనవి కావడంతో తక్కువ మంది ప్రజలు మాత్రమే వాటిని కొనగలుగుతున్నారు. వీటికి సమానమైన ఫీచర్లను కలిగి ఉండి అద్భుతంగా పనిచేస్తున్న మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క హై-ఎండ్ వేరియంట్ ఫోన్లను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. Oppo Enco W31 Earphones: అమెజాన్ లో సేల్స్ స్టార్ట్.. ఆఫర్స్ బ్రహ్మాండం...

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్
ఇప్పుడు చాలా సంస్థలు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను మెరుగైన ఫీచర్లతో అధికంగా తయారుచేస్తున్నారు. 2020 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లలో శామ్‌సంగ్ గెలాక్సీ A51 అన్నిటి కంటే ముందు వరుసలో ఉంది అని స్ట్రాటజీ అనలిటిక్స్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీని తరువాత స్థానంలో షియోమి సంస్థ యొక్క మరోక మిడ్-రేంజ్ ఫోన్ రెడ్‌మి నోట్ 8 ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ
వాస్తవానికి శామ్‌సంగ్ సంస్థ యొక్క ఫ్లాగ్‌షిప్ హై-ఎండ్ డివైస్ శామ్‌సంగ్ గెలాక్సీ S20 ప్లస్ ఫోన్ సంస్థ నుండి అత్యధికంగా అమ్ముడైన ఆరు ఫోన్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మార్కెట్ లో అదికంగా అమ్ముడైన వాటిలో ఇది మూడవ స్థానంలో నిలిచింది. కొరోనావైరస్ మహమ్మారి కారణంగా కూడా ఇప్పుడు చాలా మంది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.

స్ట్రాటజీ అనలిటిక్స్
మొబైల్ ఆపరేటర్లు ఇటీవలి సంవత్సరాలలో రాయితీలను తగ్గించినందున మరియు అనేక దేశాలు ఇప్పుడు పోస్ట్-వైరస్ మాంద్యంలో పడిపోతున్నందున ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు సెన్సిటివ్‌గా పెరుగుతున్నారు అని స్ట్రాటజీ అనలిటిక్స్ అసోసియేట్ డైరెక్టర్ జుహా వింటర్ వివరించారు. వినియోగదారులు సరసమైన ధరల వద్ద అద్భుతమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్న ఫోన్ లను కోరుకుంటారు. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఆండ్రాయిడ్ పోస్ట్-ప్రీమియం యుగంలోకి ప్రవేశిస్తోంది అని ఆయన చెప్పారు.

కెనాలిస్ గణాంకాలు
పరిశోధనా సంస్థ కెనాలిస్ గణాంకాలు కూడా ఇదే విధానాన్ని సూచిస్తున్నాయి. ధోరణి సరిగ్గా క్రొత్తది కాదు అందువల్ల ఇది వైరస్ వల్ల కూడా పూర్తిగా సంభవించదు. గత సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లు సామ్‌సంగ్ గెలాక్సీ ఎ-సిరీస్ మరియు వివిధ షియోమి రెడ్‌మి మోడల్స్ వంటివి కూడా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు కావడం గమనార్హం. అయినప్పటికీ మహమ్మారి కారణంగా దీని ప్రభావం మెరుగుపడుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ల ధర గురించి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.

ఆపిల్ ఐఫోన్
ఆపిల్ సంస్థ విడుదల చేస్తున్న ఐఫోన్ విషయంలో మాత్రం ఈ లెక్కలు కాస్త భిన్నంగా పనిచేస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 11 ఇప్పటికీ సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్. హై-ఎండ్ ఐఫోన్ 11 ప్రో మరియు ప్రో మాక్స్ కూడా ఈ జాబితాలో ఆరు మరియు పదవ స్థానాలలో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎస్‌ఇ (2020) వంటి ఫోన్‌లతో బడ్జెట్ ప్రదేశంలోకి ప్రవేశించడానికి ఈ బ్రాండ్ ఇటీవల తీవ్రమైన ప్రయత్నాలు చేసింది.


Click it and Unblock the Notifications








