Oppo Enco W31 Earphones: అమెజాన్ లో సేల్స్ స్టార్ట్.. ఆఫర్స్ బ్రహ్మాండం...

|

ఒప్పో ఇటీవల భారతదేశంలో ఎన్‌కో డబ్ల్యూ 31 మరియు ఎన్‌కో ఎం 31 అనే రెండు కొత్త ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ రెండిటిలో ఒకదానిని వినియోగదారులకు అందించడానికి ఈ రోజు మొదటిసారిగా ఇండియాలో దీని యొక్క సేల్స్ మొదలయినాయి.

 

ఇయర్‌ఫోన్స్

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ను వినియోగదారులు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కంపెనీ ఇయర్ ఫోన్‌లను వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే విక్రయించనుంది.  Kisan credit cardలను సులభంగా ఎలా పొందవచ్చో తెలుసా?

అమెజాన్ సేల్స్

అమెజాన్ సేల్స్

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియాలోని అన్ని ప్రాంతాలను జోన్ల వారిగా ప్రభుత్యం విభజించింది. ఇందులో కేవలం గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో మాత్రమే అమెజాన్ సంస్థ తన డెలివరీలను నిర్వహిస్తున్నది. రెడ్ జోన్లోని వినియోగదారులను ఇప్పటికీ ఆర్డర్ చేయడానికి అనుమతించనందున ఈ ప్రాంతంలోని వారు మరి కొంత సమయం వేచిఉండవలసి ఉంది.

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల సేల్స్ ఆఫర్స్
 

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల సేల్స్ ఆఫర్స్

ఒప్పో సంస్థ రూ.3,999 ధర వద్ద విడుదల చేసిన కొత్త ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను పొందే వినియోగదారుల కోసం ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఉత్తేజకరమైన డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వడం లేదు. ఈ ఇయర్‌ఫోన్‌ల మీద కేవలం రూ.50 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ మాత్రమే ఉంది. అది కూడా అమెజాన్ పేను ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే ఇది లభిస్తుంది. మీరు ఆర్డర్‌ల కోసం ఎంచుకున్న కార్డులపై నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందవచ్చు.

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్

సరికొత్త ఒప్పో ఎన్‌కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇన్-ఇయర్ డిజైన్ మరియు స్పోర్ట్ 7mm డ్రైవర్లతో వస్తాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు శారీరక శ్రమల్లో పాల్గొనే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని తయారుచేసారు. ఈ ఎన్కో W31 ఇయర్‌బడ్స్‌ దుమ్ము మరియు నీటి-నిరోధక డిజైన్ (IP54 రేటింగ్) నిర్మాణంతో తయారుచేయబడి ఉన్నాయి. ఒప్పో TPU (థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్స్) మరియు గ్రాఫేన్ డయాఫ్రాగమ్‌ల నుండి తయారైన మిశ్రమంతో వీటి నిర్మాణం తయారుచేయబడి ఉంది. ఇది బాస్ మరియు బ్యాలెన్స్ మోడ్‌లతో సహా మరో రెండు మోడ్‌లతో కూడా వస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

ఒప్పో ఎన్కో W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ నోయిస్ కాన్సలాషన్ అల్గోరిథం ఫీచర్ను కూడా కలిగి ఉంది. సౌకర్యవంతమైన ఫిట్‌ను అందించడానికి సంస్థ అదనంగా మరో రెండు ఇయర్-టిప్ లను కూడా జోడించింది. ఈ ఎన్‌కో ఇయర్‌ఫోన్స్ ఒకే ఛార్జీలో 25 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదు. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి కూడా మద్దతును ఇస్తుంది. అలాగే ఇది 94ms చాలా తక్కువ జాప్యాన్ని కలిగి ఉంటుంది. Oppo Enco W31 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు యాంటీ-విండో సౌండ్ ఛాంబర్లతో పాటు AI సౌండ్ లెస్ సామర్థ్యాలతో రెండు మైక్రోఫోన్‌లను అందిస్తున్నాయి. ఇయర్‌ఫోన్‌ల విషయంలో యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Oppo Enco W31 Wireless Earphones Sale Live on Amazon: Price, Discounts and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X