Android 11 అప్‌డేట్‌ను అందుకున్న గెలాక్సీ A51 !! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

శామ్‌సంగ్ గెలాక్సీ A51 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ జనవరి 2020 లో ఆండ్రాయిడ్ 10 తో ఇండియాలో విడుదల అయినప్పటి నుంచి మంచి ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI 3.0 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో రష్యాలో ఈ అప్‌డేట్‌ ప్రారంభమైంది. ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. శామ్‌సంగ్ గెలాక్సీ A51 ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ బిల్డ్ నంబర్ A515FXXU4DUB1 తో వస్తుంది. ఇది తాజా ఫిబ్రవరి 2021 సెక్యూరిటీ ప్యాచ్‌తో కలిపి వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకున్న శామ్‌సంగ్ లైనప్‌లో కొత్త ఇది ఉండడం మరొక గొప్ప విషయం.

 

గెలాక్సీ A51 ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్

గెలాక్సీ A51 ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్

శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి ప్రారంభంలో రష్యాలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI 3.0 అప్‌డేట్‌ను అందుకోవడం మొదలైంది. ట్విట్టర్లో వినియోగదారులు షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ A51 యొక్క ఇండియన్ వేరియంట్ ఫర్మ్వేర్ వెర్షన్ A515FXXU4DUB1 నెంబర్ గల ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 11 మరియు వన్ Ui3.0 యొక్క అన్ని ఫీచర్లతో పాటు శామ్సంగ్ గెలాక్సీ A51 సరికొత్త ఫిబ్రవరి 2021 సెక్యూరిటీ ప్యాచ్‌ను అదనంగా అందుకుంటున్నది.

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌లో గల ముఖ్యమైన ఫీచర్లలో వన్-టైమ్ అనుమతులు, నోటిఫికేషన్ల ప్రాంతంలో ప్రత్యేక సంభాషణల విభాగం, చాట్ బబుల్స్, అంకితమైన మీడియా ప్లేబ్యాక్ విడ్జెట్ వంటివి మరిన్ని ఉన్నాయి. ఇది కొత్త UI డిజైన్, డార్క్ మోడ్, డిజిటల్ వెల్ బీయింగ్, పేరెంటల్ కంట్రోల్ వంటివి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ కనుగొనే విధానం
 

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ కనుగొనే విధానం

మీరు శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూ ఉంటే కనుక మీరు ఇప్పటికీ నోటిఫికేషన్ ను అందుకోకపోతే కనుక కొత్త అప్‌డేట్‌ అందుబాటులో ఉందొ లేదో తెలుసుకోవడానికి సెట్టింగులు> సిస్టమ్ అప్‌డేట్‌ వంటి పద్దతులను పాటించడంతో సిస్టమ్ అప్‌డేట్‌లను తనిఖీ చేయవచ్చు. అక్కడ కూడా కొత్త అప్‌డేట్‌ గురించి ఎటువంటి సమాచారం లేకుంటే కనుక మీరు కొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంటుంది.

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకున్న శామ్‌సంగ్ ఫోన్‌లు

ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకున్న శామ్‌సంగ్ ఫోన్‌లు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.0 అప్‌డేట్‌లను దాని ఫ్లాగ్‌షిప్‌లకు మాత్రమే కాకుండా మిడ్-టైర్ ఫోన్‌లకు కూడా అందించడంలో శామ్‌సంగ్ చాలా చురుకుగా పనిచేస్తున్నది. వీటిలో శామ్‌సంగ్ గెలాక్సీ M31s, శామ్‌సంగ్ గెలాక్సీ A71 గత వారం అప్‌డేట్‌లను పొందాయి. దీనికి ముందు శామ్సంగ్ గెలాక్సీ S20 FE మరియు శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఇప్పటికే అప్‌డేట్‌లను అందుకుంది. ఆండ్రాయిడ్ 11 ను అందుకున్న మరికొన్ని ఫోన్‌లలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 41, మరియు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A51 Smartphone Start Receiving Android 11-Based One UI 3.0 Update in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X