Samsung Galaxy M01 స్మార్ట్‌ఫోన్ మీద భారీ ధర తగ్గింపు!!!
ఇండియాలో బడ్జెట్ ధరలో శామ్‌సంగ్ సంస్థ జూన్ నెలలో విడుదల చేసిన గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరలు ఇప్పుడు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు ధరలో ఇండియాలో రేపటి నుంచే అంటే ఆగస్టు 18 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా రేపటి నుంచి తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ లభ్యత వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఇండియాలో రూ .8,999 ధర వద్ద 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ లో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 4,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో విడుదల అయ్యే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M01 తగ్గింపు ధరల వివరాలు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు మీద ఇప్పటికే ఒక బ్యానర్ ను విడుదల చేసింది. ఈ బ్యానర్ ప్రకారం 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఏకైక మోడల్‌లో లభించే ఫోన్ రేపటి నుంచి రూ.8,399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను బ్లాక్, బ్లూ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఎంపికలలో పొందవచ్చు. అయితే ఇది శాశ్వత ధరల తగ్గింప లేదా తాత్కాలిక ధరల తగ్గుదల అనేది స్పష్టంగా తెలియదు.

శామ్సంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ 5.7-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1280 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M01 డ్యూయల్ కెమెరా సెటప్
శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా f / 2.48 ఎపర్చర్‌తో 13MP లెన్స్ కెమెరా మరియు దీనితో పాటు f /1.8 ఎపర్చర్‌తో 2MP సెకండరీ లెన్స్ కెమెరాలు కలిగి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో f / 2.48 ఎపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M01 4,000mAh బ్యాటరీ ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది వినియోగదారుకు సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దానితో పాటు ఇది మీ ఆరోగ్య స్థాయిలను పర్యవేక్షించడానికి శామ్‌సంగ్ హెల్త్ యాప్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంది. అదనపు భద్రత కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్ అన్‌లాకింగ్ అనుభవాన్ని శీఘ్రంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫేస్ రికగ్నిషన్‌ను జోడించింది. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉండి 168 గ్రాముల బరువుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








