శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G వచ్చేసింది!!! ధర చాలా ఎక్కువ!!!

|

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5Gని ప్రస్తుతం యుఎస్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి నెలలో విడుదల అయిన శామ్‌సంగ్ గెలాక్సీ Zఫ్లిప్ యొక్క 5G మోడల్ నెట్‌వర్క్ సపోర్ట్‌ను జోడిస్తు అతి వేగంగా అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ కొత్త ఫోన్ లాంచ్ ఆగస్టు 5 న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు వస్తుంది.

 

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G లాంచ్

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G లాంచ్

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5G కొత్త ఫోన్ 5G నాన్-స్టాండ్ అలోన్ (NSA), 5G స్టాండలోన్ (SA) నెట్‌వర్క్ మరియు సబ్6 బ్యాండ్‌ల మద్దతుతో లభిస్తుంది. ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే ఇది క్లామ్‌షెల్ లాంటి ఓపెన్ అండ్ క్లోజ్ డిజైన్, బయటి షెల్‌పై చిన్న కవర్ డిస్ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ 865+ SoC వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ ను కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. దీని యొక్క ధర $1449.99 ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.1,08,200. ఇది USలో ఆగస్టు 7 నుండి క్యారియర్ మరియు అన్‌లాక్ వెర్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ మిస్టిక్ గ్రే మరియు మిస్టిక్ బ్రోన్జ్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 4G వెర్షన్ US లో $1,380 (సుమారు రూ.98,400) ధర వద్ద విడుదల అయింది.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్స్
 

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్రాసెసర్‌లో అప్‌గ్రేడ్ మరియు 5G ఫీచర్లను అదనంగా ఉపయోగించడం మినహా దాని 4G వెర్షన్ కు సమానమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను 1080x2636 పిక్సెల్స్ మరియు 21.9: 9, 425pp కారక నిష్పత్తితో వస్తుంది. బయటి షెల్‌లో 301ppi లతో 1.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 865+ ఆక్టా-కోర్ SoC చేత రన్ అవుతూ 8GB RAM తో జత చేయబడి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చుర్ తో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది ఫోటోలను 80-డిగ్రీల FoV కోణంలో కూడా తీయడానికి వీలుగా ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ 3,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఫోల్డ్ నుండి ఓపెన్ చేసినప్పుడు 167.3x73.6x7.2mm కొలతల పరిమాణంలో ఉంటుంది. ఇది 183 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. గెలాక్సీ Z ఫ్లిప్‌లో ఫ్లెక్స్ మోడ్ UI మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ను బహుళ కోణాల్లో తెరిచి ఉంచడానికి వినియోగదారులను అనుమతించే 'హైడ్‌వే హింజ్' ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Flip 5G with Super AMOLEDx Display Launched: Specs and Availability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X