Home
News

Samsung Galaxy M02 బడ్జెట్ ఫోన్ విడుదల అయింది!!బడ్జెట్ ధరలో బెస్ట్ ఇదే..

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ శామ్‌సంగ్ సరసమైన ధరలో అందించే కొత్త ఫోన్ గెలాక్సీ M02 ను అనేక పుకార్ల తరువాత నేడు ఇండియాలో అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో లాంచ్ చేసిన గెలాక్సీ M01 కి అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న గెలాక్సీ M02 డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ SoC వంటి ఫీచర్లను కలిగి ఉండి రూ.6,799 ప్రారంభ ధర వద్ద లభిస్తూ రియల్‌మి Cసిరీస్, పోకో Mసిరీస్, రెడ్‌మి 9 సిరీస్ వంటి ఇతర ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ M02 ధరలు & అమెజాన్ సేల్స్

గెలాక్సీ M02 ధరలు & అమెజాన్ సేల్స్

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M02 యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.6,999 ధర వద్ద విడుదల చేసింది. అయితే ఇది పరిచయ ధర వద్ద ప్రారంభంలో అమెజాన్.ఇన్‌లో అధికారికంగా రూ.6,799 బ్లాక్, బ్లూ, గ్రే మరియు రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 3GB + 32GB స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. అయితే సంస్థ ఇంకా దీని యొక్క ధరను విడుదల చేయలేదు. గెలాక్సీ M02 ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ మరియు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ఫిబ్రవరి 9 నుండి విక్రయించబడుతుంది.

గెలాక్సీ M02 మీడియాటెక్ ప్రాసెసర్ ఫీచర్స్

గెలాక్సీ M02 మీడియాటెక్ ప్రాసెసర్ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M02 ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మెరుగైన వీక్షణ అనుభవం కోసం 6.5 అంగుళాల HD + ఇన్ఫినిటీ V డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతి ఉంది. శామ్సంగ్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లల్లో ఒకటి బ్యాటరీ. ఇది 5000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

గెలాక్సీ M02 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

గెలాక్సీ M02 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో వన్ యుఐతో రన్ అవుతుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M02 ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M02 Entry-Level Smartphone Released in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X