కొంపముంచిన గెలాక్సీ నోట్ 7 : శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7

Written By:

ఇండియా మార్కెట్లో ప్రభంజనాలు సృష్టిస్తున్న శాంసంగ్ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోయే పరిస్థితులు తెచ్చుకుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలుతున్నాయనే వార్తలతో శాంసంగ్ మార్కెట్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఇదే అదనుగా ఆపిల్ తన ఐఫోన్ 7 లాంచింగ్ చేయడంతో అందరూ ఆపిల్ వైపు చూపును నిలిపారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఐ ఫోన్ 7 దుమ్మురేపుతోంది. ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.

దడ పుట్టిస్తున్న ఆపిల్ అమ్మకాలు..అప్పుడే ఐఫోన్ 7 అవుట్ ఆఫ్ స్టాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అడ్వాన్స్ బుకింగ్స్‌లో

ఆపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతున్నాయి. భారత రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ల ముందస్తు బుకింగ్స్ గతేడాది విడుదలైన ఐఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్‌లతో పోలిస్తే 50 శాతానికి పైగా ఎగిశాయని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు.

శాంసంగ్‌కు గెలాక్సీ నోట్ 7 రూపంలో ఎదురైన ముప్పు

అత్యాధునిక ఫీచర్లతో పాటు, ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్‌కు గెలాక్సీ నోట్ 7 రూపంలో ఎదురైన ముప్పు, ఆపిల్ తాజా ఐఫోన్లకు బాగా కలిసొచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

అక్టోబర్ 1 నుంచి ఈ ఆర్డర్లు

అధికారికంగా అక్టోబర్ 1 నుంచి ఈ ఆర్డర్లు ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తు బుకింగ్స్ అదరగొడుతున్నాయని చెబుతున్నాయి. భారత్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా లాంచ్ ఇన్వెంటరీని ఎక్కువగా విడుదల చేయాలని ఆపిల్ భావిస్తోంది.

గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీకాల్

మరో వైపు ఆపిల్ ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ కంపెనీకి బ్యాటరీ పేలుళ్ల ఘటనతో వచ్చిన చిక్కుతో, గ్లోబల్‌గా తన గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీకాల్ చేస్తోంది.

సెప్టెంబర్ 28-30 తేదీల్లో భారత మార్కెట్లోకి

అయితే శాంసంగ్ తన బ్యాటరీ పేలుళ్ల సమస్యను పరిష్కరించిందని, సెప్టెంబర్ 28-30 తేదీల్లో భారత మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పునఃప్రవేశపెడుతుందని పలువురు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 28 న దక్షిణ కొరియాలో

సెప్టెంబర్ 28 న దక్షిణ కొరియాలో గెలాక్సీ నోట్ 7 ఫోన్లను మార్కెట్లోకి రీలాంచ్ చేస్తామని శాంసంగ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దక్షిణకొరియాతో పాటు భారత్‌లోనూ ఈ ఫోన్లను రీలాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

జెట్ బ్లాక్ కలర్ ఐఫోన్ 7 ప్లస్‌కు

ఆపిల్ నుంచి వచ్చిన జెట్ బ్లాక్ కలర్ ఐఫోన్ 7 ప్లస్‌కు, 32 జీబీ వేరియంట్ ఐఫోన్ 7 కు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 ధర భారత్‌లో రూ .60 వేల నుంచి రూ .80 వేల మధ్యలో ఉండగా .. ఐఫోన్ 7 ప్లస్ ధర రూ 72 వేల నుంచి రూ .92 వేల మధ్యలో ఉన్నాయి.

ఆలస్యం చేస్తే కంపెనీకి ఎక్కువ నష్టం

పండుగ సీజన్‌లో భారత్‌లో ఆపిల్-శాంసంగ్‌లకు పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒకవేళ శాంసంగ్ తన ఫోన్లను పునఃప్రవేశపెట్టడం ఆలస్యం చేస్తే ఆ కంపెనీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముందని టెక్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..

శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

 

ఐఫోన్ 7 అవుట్ ఆఫ్ స్టాక్

దడ పుట్టిస్తున్న ఆపిల్ అమ్మకాలు..అప్పుడే ఐఫోన్ 7 అవుట్ ఆఫ్ స్టాక్. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు

త్వరపడండి :ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

బుకింగ్స్ రెడీ

ఐఫోన్ 7,7 ప్లస్ బుకింగ్స్ రెడీ..అడ్వాన్స్ ఎంతంటే.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లు చాలా డేంజర్

కొత్త షాక్: ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లు చాలా డేంజర్ !..స్టోరీ కోసం క్లిక్ చేయండి 

ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది

ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్

షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి! ఎలానో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 7 & 7 Plus preorders jump 50% in India after Samsung Note 7 debacle read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot