Home
News

మా ఫోన్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: లేకుంటే పెను ప్రమాదం

By Hazarath

శాంసంగ్ కంపెనీకి ఎన్నడూ ఊహించని దెబ్బ తగిలింది. కంపెనీ తన ఫోన్లను రీకాల్ చేసి కొత్త ఫోన్లు ఇచ్చినప్పటికీ సమస్య తీవ్రం కావడంతో కంపెనీ స్వయంగా ఫోన్లను వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలంటోంది. శాంసంగ్ కంపెనీ తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసేయాలని లేకుంటే మీరు ప్రమాదంలోచిక్కుకుంటారని చెబుతోంది.

పంపిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా..?

 వెంటనే స్విచాఫ్

వెంటనే స్విచాఫ్

వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా

మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా

మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు

అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు

అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి. కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి.

మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు

మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు

అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని

ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని

దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది.

అసలు సమస్య బ్యాటరీలో ఉందని

అసలు సమస్య బ్యాటరీలో ఉందని

అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ పరిశోధనలలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయడం ఇది రెండోసారి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్ ఐఫోన్‌కు దీటుగా

ఆపిల్ ఐఫోన్‌కు దీటుగా

ఆపిల్ ఐఫోన్‌కు దీటుగా ఉండేలా ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసింది. దానికి ప్రీబుకింగ్స్ భారీగా ఉండటంతో తొలుత సరఫరా చేయలేనంత పరిస్థితి ఏర్పడింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే

అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే

కానీ, అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే సోషల్ మీడియాలో ఇందులోని సమస్యల గురించి బాగా ప్రచారం జరిగింది. బ్యాటరీలలో సమస్యలు ఉన్నాయని దాదాపు 25 లక్షల ఫోన్లను వెనక్కి తీసుకుని, వాటి బ్యాటరీలు మార్చి మళ్లీ ఇచ్చింది.

 సమస్య అలాగే ఉండటంతో

సమస్య అలాగే ఉండటంతో

ఆ తర్వాత కూడా సమస్య అలాగే ఉండటంతో ఇక ప్రస్తుతానికి ఆ ఫోన్ వాడకం ఆపేయమనడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా పోయింది.శాంసంగ్ ఈ దెబ్బతో మళ్ల తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది ఇప్పుడు టెక్ వర్గాలను సైతం కలవరపెడుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 7 owners told to turn off read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X