విమానాల్లో శాంసంగ్ ఫోన్లపై నిషేధం : ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం

By Hazarath
|

శాంసంగ్ కంపెనీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికీ మొన్న శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోన్లు పేలడంతో ఒక్కసారిగా నిరాశలోకి కూరుకుపోయిన శాంసంగ్ కు ఇప్పుడు ఎయిర్ వేస్ అధికారుల రూపంలో మరో షాక్ తగిలింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను విమానాల్లోకి తీసుకురావద్దని ప్రయాణికులకు నిషేధాజ్ఙలు జారీ చేసింది. అవి తీసుకువస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయంటూ హెచ్చరికలు జారీ చేసింది.

షాక్.. శాంసంగ్ ఆ ఫోన్లను రీకాల్ చేస్తోంది

#1

#1

ప్రముఖ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ అమెరికా ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,దిఫెడరల్ ఏవియేషన్ అధారిటీ ( ఎఫ్ఎఎ)లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

#2

#2

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలుతున్న నేపథ్యంలో ఆ ఫోన్లతో విమానాల్లో ప్రయాణించరాదని, ఆ ఫోన్లతో విమానాల్లో ప్రయాణికులు ఎక్కడం నిషేధమని ప్రకటించింది.

#3

#3

శాంసంగ్ గెలాక్నీ నోట్ 7 ఫోన్లు ఇప్పటికే దాదాపు 33 ఫోన్లు పేలిపోయాయని వార్తలు రావడంతో ఎయిర్ వేస్ అలర్టయింది. అదీ గాక శాంసంగ్ అన్ని ఫోన్లను రీకాల్ చేయాలంటూ పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికారులు చెబుతున్నారు.

#4

#4

కంపెనీ దాదాపు 2. 5మిలియన్ ఫోన్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే శాంసంగ్ ఈ ఫోన్లను విడుదలను యుఎస్ తో పాటు అన్ని చోట్లా ఆపేసింది. ఫోన్ పేలిపోయిన కష్టమర్లకు వేరే ఆప్సన్ కింద గెలాక్సీ ఎస్7, ఎస్7ఎడ్జ్ ఫోన్లను అందించింది. సెప్టెంబర్ 19 నుంచి తిరిగి యుఎస్ లో అమ్మకాలు చేపడతామని కంపెనీ తెలిపింది.

#5

#5

అయితే శాం సంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు అమ్మకాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయి. విడుదలయిన కొద్ది రోజులకే అన్ని ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

#6

#6

అయితే ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడంతో శాంసంగ్ ఒక్కసారిగా నిరాశకు గురిఅయింది. ఇప్పుడు విమానాల్లో ఈ ఫోన్‌పై నిషేధం విధించడంతో ఇంకా నిరాశలోకి కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.

#7

#7

అయితే ఊరటనిచ్చే అంశం ఏంటంటే తమ విమానాలు ఎక్కే వారిదగ్గర నోట్ 7 ఫోన్లు ఉంటే వాటిని ఆన్ చేయడం లేదా చార్జింగ్ పెట్టడాన్ని నిషేధిస్తున్నట్టు క్వాంటాస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దేశవాళీ, ఇంటర్నేషనల్ రూట్లలోని అన్ని విమానాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని అన్నారు.

#8

#8

ఈ కొత్త ఫోన్ తమ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో నడిపిస్తుందని రాబడులను అత్యధికంగా ఆర్జించడానికి దోహదం చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసిస కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం శాంసంగ్ కు నిజంగా కోలుకోలేని షాక్. డిమాండ్ కు సరిపడా సప్లయి లేక లాంచ్ తేదీలను సైతం వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే

Best Mobiles in India

English summary
Here Write Samsung Galaxy Note 7 phones could be banned from flights

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X