జనవరి 14న లాంచ్ కానున్న Galaxy S21 Series స్మార్ట్‌ఫోన్‌లు!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి..

|

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్ 2021 సంవత్సరంలో మొదటి ఫోన్‌ను విడుదల చేయడానికి లాంచ్ డేట్ ను ప్రకటించింది. గెలాక్సీ S సిరీస్ లైనప్‌లో వస్తున్న శామ్‌సంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S21 సిరీస్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నది. గెలాక్సీ S20 సిరీస్ యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా గెలాక్సీ S21 సిరీస్‌ను 2021లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. 2021లో అత్యంత విలువైన ఫీచర్లతో లభించే స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తున్నట్లు తాజా సమాచారం ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ S21 జనవరి 2021 లాంచ్ వివరాలు
 

గెలాక్సీ S21 జనవరి 2021 లాంచ్ వివరాలు

శామ్సంగ్ సంస్థ 2021లో తన మొట్టమొదటి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ను ప్రకటించింది. ఈ ఈవెంట్ లో గెలాక్సీ S21 సిరీస్ ను ప్రారంభిస్తున్నట్లు కొన్ని నిఘావర్గాల సమాచారం. అధికారిక టీజర్ లోని సమాచారం ప్రకారం గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ జనవరి 14 న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఉదయం 10 గంటలకు EST మరియు రాత్రి 8:30 గంటలకు IST లో ప్రారంభించబడుతుంది. కొత్త గెలాక్సీ S21 ఫోన్‌లపై టీజర్ ఎక్కువ సమాచారం ఇవ్వకపోగా వెనుక కెమెరా మాడ్యూల్ సమాచారంను అందిస్తున్నది.

Galaxy S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఊహించిన స్పెసిఫికేషన్స్ వివరాలు

Galaxy S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఊహించిన స్పెసిఫికేషన్స్ వివరాలు

గెలాక్సీ S21 సిరీస్‌లో భాగంగా శామ్‌సంగ్ సంస్థ మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది: గెలాక్సీ S21, గెలాక్సీ S21 ప్లస్ మరియు గెలాక్సీ S21 అల్ట్రా పేరుతో మూడు ‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. కొన్ని లీక్ల ప్రకారం ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 120HZ రిఫ్రెష్ రేట్‌తో పంచ్-హోల్ డిజైన్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో రాబోతున్నట్లు సమాచారం. గెలాక్సీ S21 మరియు గెలాక్సీ S21 ప్లస్ రెండు ఫ్లాట్ డిస్ప్లేలను కలిగి ఉండగా గెలాక్సీ S21 అల్ట్రా వక్రమైన డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

గెలాక్సీ S21 సిరీస్ కెమెరా సెన్సార్‌ ఫీచర్స్

గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరా సెటప్ విషయానికొస్తే అన్ని ఫోన్‌లలోని కెమెరా సెన్సార్‌లు దీర్ఘచతురస్రాకార మాడ్యూళ్ళను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. గెలాక్సీ S21 అల్ట్రాలో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా మిగతా రెండు మోడళ్లు 64 మెగాపిక్సెల్ సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరాలు కలిగి ఉంటాయి.

గెలాక్సీ S21 సిరీస్ బ్యాటరీ ఫీచర్స్
 

గెలాక్సీ S21 సిరీస్ బ్యాటరీ ఫీచర్స్

గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న మార్కెట్‌ను బట్టి సరికొత్త ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC చిప్ సెట్ ను కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ మరియు గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా యొక్క బ్యాటరీ మద్దతు విషయానికి వరుసగా 4,000mAh, 4,800mAh మరియు 4,885mAh బ్యాటరీలతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు సమాచారం. ఇవి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా శామ్‌సంగ్ వన్ UI3.0 ను అమలు చేసే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy S21 Series India Launch Date Revealed: Expected Price, Specs, Features and More.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X