సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 Vs యాపిల్ ఐఫోన్ 6

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య నువ్వా.. నేనా అన్న పోటీ రోజురోజకూ పెరిగిపోతోంది. 2015కుగాను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్6 యాపిల్ తన ఫ్లాగ్‌‌షిప్ మోడల్ ఫోన్ ఐఫోన్ 6కు పోటీగా నిలిచింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6ను యాపిల్ ఐఫోన్ 6తో విశ్లేషిస్తూ విశ్లేషిస్తూ వాటి మధ్య వ్యత్యాసాలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

(ఇంకా చదవండి : వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైనింగ్ విషయంలో:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 మెటల్ ఇంకా గ్లాస్ బాడీతో డిజైన్ కాబడింది. 6.9 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్నఐఫోన్ 6 చేతిలో సరిగ్గా ఇమిడిపోతుంది. గెలాక్సీ ఎస్6 వొంపులు దగ్గర నుంచి ఇంకా స్పీకర్ ఇంకా చార్జింగ్ డాక్ వరకు ఐఫోన్ 6 ప్రేరణతో డిజైన్ కాబడినట్లు అనిపిస్తుంది. కాబట్టి, డిజైనింగ్ విషయంలో ఖచ్చితమైన విజేత యాపిల్ ఐపోన్ 6 అనే

చెప్పాలి.

 

డిస్‌ప్లే విషయంలో

యాపిల్ ఐఫోన్ 6, 750 x 1334 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4.7 అంగుళాల డిస్ ప్లే(326పీపీఐ)ను కలిగి ఉంది. ఇదే సమయంలో గెలాక్సీ ఎస్6, 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్‌తో లభ్యమవుతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1440 x 2560పిక్సల్స్, 572 పీపీఐ. కాబట్టి, డిస్‌ప్లే విషయంలో ఖచ్చితమైన విజేత గెలాక్సీ ఎస్6 అనే చెప్పాలి.

 

ప్రాసెసర్ 

గెలాక్సీ ఎస్6 రెండు క్వాడో కోర్ ప్రాసెసర్ వేరింయట్స్ (2.1గిగాహెర్ట్జ్, 1.5గిగాహెర్ట్ క్లాక్ వేగంతో) కూడిన ఎక్సినోస్ 7 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 3జీబి ర్యామ్ ఫోన్  సామర్థ్యాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. యాపిల్ ఐఫోన్ 6 విషయానికొస్తే, ఈ డివైస్‌లో 64 బిట్ 1.39గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఏ8 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసారు. 1జీబి ర్యామ్. ప్రాసెసర్ విభాగంలో  ఈ రెండు ఫోన్‌లు సమానమైన మార్కులు కొట్టేసాయి.

ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే గెలాక్సీ ఎస్6 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ లాలీపాప్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ 6, యాపిల్ సరికొత్త ఐఓఎస్ 8.1 ఓఎస్ పై స్పందిస్తుంది.  ఆపరేటింగ్ సిస్టం విభాగంలో ఈ రెండు ఫోన్‌లు సమానమైన మార్కులు కొట్టేసాయి.

 

కెమెరా విషయానికొస్తే:

యాపిల్ ఐఫోన్ 6, 8 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటే. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6లో, శక్తివంతమైన 16 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. కెమెరా విషయంలో విజేత గెలాక్సీ ఎస్6 అనే చెప్పాలి.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6లో 2550 ఎమ్ఏహెచ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని నిక్షిప్తం చేసారు. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 6, 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది. బ్యాటరీ విషయంలో విజేత గెలాక్సీ ఎస్6 అనే చెప్పాలి.

 

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు అనేక విభాగాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. డిజైనింగ్ ఇంకా యూజర్ ఇంటర్ ఫేస్ విషయంలో యాపిల్ ఐఫోన్ 6 స్ఫస్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే గెలాక్సీ ఎస్6.. డిస్ ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ విషయాల్లో స్ఫష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

 

వినియోగదారులు తమ అభిరుచులను బట్టి తమకు ఈ రెండు బ్రాండ్‌లలో తమకు నచ్చిన బ్రాండ్‌ను ఎంపిక చేసేుకుంటే సరిపోతుంది.  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S6 Vs Apple iPhone 6: Which Is Better. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot