తెలంగాణాలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్!

Posted By:

తెలంగాణాలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తెలంగాణాలో దాదాపు 100 మిలియన్ డాలర్ల (రూ. 630 కోట్ల) పెట్టుబడులతో కూడిన తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. తమ ఐటీ పరిశ్రమల శాఖా మంత్రులు ఈ ప్రతిపాదనకు సంబంధించి సామ్‌సంగ్ హైదరాబాద్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇంకా చదవండి: అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

సామ్‌సంగ్‌తో సహా పలు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమ మరింతగా విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నట్లు మంత్రి వివరించారు. తాము కొత్తగా తీసుకువచ్చే పరిశ్రమల విధానంలో 24 గంటల విద్యుత్ సరఫరా అంశం తెలంగాణాను పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతంగా మార్చనుందని ఆయన వెల్లడించారు.

English summary
Samsung keen to set up $100 million unit in Telangana: K Chandrasekhar Rao. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot