అద్బుతమైన తగ్గింపులతో అమ్మకానికి శామ్సంగ్ గెలాక్సీM20
ఇండియాలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మొబైల్ శామ్సంగ్. ఈ కంపెని నుంచి వచ్చిన ప్రతి మొబైల్ కూడా మంచి గుర్తింపును పొందాయి.
ఇండియాలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మొబైల్ శామ్సంగ్. ఈ కంపెని నుంచి వచ్చిన ప్రతి మొబైల్ కూడా మంచి గుర్తింపును పొందాయి.ఆఫర్లను ఇవ్వడంలో ఎప్పుడు ముందు ఉండే శామ్సంగ్ ఈ సంవత్సరం మొదటిలో శామ్సంగ్ గెలాక్సీM20ను జనవరిలో రిలీజ్ చేసారు.

ఇప్పుడు అమెజాన్,శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్ రెండింటి ద్వారా ఇండియాలో అద్భుతమైన ఆఫర్లతో విక్రయించనుంది.ఈ మొబైల్ పై ముందున్న ధర రూ. 10,900 కంటే రూ.1,000 తగ్గింపు ధరతో ఇప్పుడు రూ.9,990కు అందుబాటులో ఉంది.ఈ ఫోన్ యొక్క ముఖ్యాంశాలు 5,000 mAh బ్యాటరీ, 4GB RAM,వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటాయి.

శామ్సంగ్ గెలాక్సీM20 ధర వివరాలు:
ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ M20 3GB RAM / 32GB స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.10,900 పై రూ.1,000 తగ్గింపు తో కేవలం రూ.9,990 కు మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.ఈ ధర తగ్గింపు 4GB RAM/64GBస్టోరేజీ వేరియంట్లకు కూడా వర్తించబడుతుంది. ఇప్పుడు దీని అసలు ధర రూ.12,990 కంటే రూ.11,990కు లబిస్తుంది.
* 3GB RAM/32GB స్టోరేజీ వేరియంట్ ------ రూ.9,990(రూ.10,900)
* 4GB RAM/64GB స్టోరేజీ వేరియంట్ ------ రూ.11,990(రూ.12,990)
ఇది అమెజాన్ ఇండియా మరియు శామ్సంగ్ ఆన్లైన్ షాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది చార్కోల్ బ్లాక్ మరియు ఓషన్ బ్లూ రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది..

స్పెసిఫికేషన్స్:
శామ్సంగ్ గెలాక్సీM20 6.3-inch ఫుల్-HD + (1080x2340 పిక్సెల్స్) ఇన్ఫినిటీ- V డిస్ప్లే తో పాటు 19.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయోని శామ్సంగ్ ఎక్స్పీరియన్స్ 9.5 UX ఆధారంగా నిర్వహిస్తుంది,మరియు డ్యూయల్ సిమ్ (నానో),Exynos 7904 SoC శక్తితో పని చేస్తుంది. ఇది 3GB మరియు 4GB RAM ఎంపికలతో వస్తుంది.
ఇమేజెస్ మరియు వీడియోల కోసం వెనుక వైపు 13-మెగాపిక్సెల్ f / 1.9 ఎపర్చర్ ప్రైమరీ సెన్సార్ మరియు 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.ముందు వైపు f / 2.0 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
గెలాక్సీ M20 32GB మరియు 64GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వస్తుంది. ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఇది USB టైప్-సి ద్వారా వేగంగా ఛార్జింగ్ కు మద్దతిస్తుంది.

స్పెసిఫికేషన్స్:
* డిస్ప్లే ------ 6.30-inch
* ప్రాసెసర్ ------ శామ్సంగ్ Exynos 7904
* ఫ్రంట్ కెమెరా ------ 8-మెగాపిక్సల్
* రెసొల్యూషన్స్ ------- 1080x2340 pixels
* RAM ------- 3GB
* OS ------- ఆండ్రాయిడ్ 8.1ఒరియా
* స్టోరేజీ -------- 32GB
* బ్యాక్ కెమెరా -------- 13-మెగాపిక్సల్ + 5-మెగాపిక్సల్
* బ్యాటరీ -------- 5000mAh


Click it and Unblock the Notifications








