Home
News

మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 5, ప్రారంభ ధర రూ.53,990

సామ్‌సంగ్ ఎట్టకేలకు తన గెలాక్సీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 32జీబి వర్షన్ ధర రూ.53,990, 64జీబి వర్షన్ ధర రూ.59,900. సెప్టంబర్ 20 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు నేటి నుంచి అందుబాటులో ఉంటాయి.

Read More : అంతరిక్షంలో అరుదైన ఫోటోలు

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే గెలాక్సీ నోట్ 5 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 515 పీపీఐ) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 64 బిట్ ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 7420 సాక్ (కార్టెక్స్ - ఏ57 + కార్టెక్స్ ఏ53), 4జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నట్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్‌రేట్ మానిటర్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ క్యాటగిరి 6, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0).

Read More : మొక్క నుంచే ఫోన్ చార్జింగ్

గెలాక్సీ నోట్ 5 చుట్టుకొలత 153.2x76.1x7.6మిల్లీ మీటర్లు, బరువు 171 గ్రాములు. బ్లాక్ సఫైర్, గోల్డ్ ప్లాటినమ్ ఇంకా సిల్వర్ టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో డివైస్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ కొనుగోలు పై 100జీబి ఉచిత వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను సామ్‌సంగ్ అందిస్తోంది. అంతే కాకుండా డివైస్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఉచిత వైర్‌లెస్ చార్జర్‌తో పాటు వన్ - టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌ను సామ్‌సంగ్ అందిస్తోంది.

సామ్‌‍సంగ్ గెలాక్సీ గెలాక్సీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ఆకట్టుకునే అంశాలతో పాటు ఐదు నిరుత్సాహపరిచే అంశాలను ఇప్పుడు చూద్దాం..

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్. గెలాక్సీ నోట్ 5లో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్ ద్వారా విజువల్స్‌ను అత్యుత్తమ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు.

 

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5 వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఎస్ పెన్ స్టైలస్ ఫీచర్‌ను మరింతగా ఆధునీకరించారు. ఈ స్టైలస్ ద్వారా నోట్స్ తీసుకోవటం, ఫోటోలను ఎడిట్ చేసుకోవటం ఇలా రకరకాల పనులకు ఉపయోగించుకోవచ్చు.

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

సామ్‌సంగ్ పే పేరుతో సరికొత్త పేమెంట్ చెల్లింపు ఫీచర్‌ను గెలాక్సీ నోట్ 5లో ప్రీలోడ్ చేయటం జరిగింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలను చకాచకా నిర్వహించుకోవచ్చు.

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గ్లాస్ ఇంకా మెటల్ బాడీ కలయకతో రూపుదిద్దుకున్న గెలాక్సీ నోట్ 5 ప్రీమియమ్ లుక్ ఇంకా ఫీల్‌తో అదరహో అనిపిస్తుంది.

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

నాన్-రిమూవబుల్ బ్యాటరీ
గెలాక్సీ నోట్ 5లో ఏర్పాటు చేసిన బ్యాటరీని బయటకు తీయటం కుదరదు. ఇది నిరుత్సాహ పరిచే అంశమే.

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు


గెలాక్సీ నోట్ 5లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లేదు. దీంతో ఫోన్ లోని మెమరీతోనే సరిపెట్టుకోవాలి. పెంచుకునేందుకు ఆస్కారం లేదు.

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లో వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లోపించింది. అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే అంతే సంగతులు..?

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లో ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ లోపించింది

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

ఈ మధ్య కాలంలో బాగా పాపులరైన యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ ఫీచర్ గెలాక్సీ నోట్ 5లో లోపించటం సామ్‌సంగ్ అభిమానులను నిరుత్సాహపరిచే అంశమే.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Note 5 launched in India starting at Rs 53,990. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X