మొక్క నుంచే ఫోన్ చార్జింగ్

Posted By:

త్వరలో కరెంటుతో పనిలేకుండా మీ మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసకోవచ్చు. ఇది ఏలా సాధ్యం అంటారా..? చిలీ దేశానికి చెందిన ముగ్గురు యువ ఇంజినిర్లు ‘‘E-Kaia" పేరుతో ఓ సరికొత్త యూఎస్బీ చార్జర్‌ను అభివృద్థి చేసారు. ఈ ప్రత్యేకమైన చార్జర్, కుండీలో నాటి ఉన్న మొక్క ద్వారా శక్తిని గ్రహించుకుని ఆ శక్తిని మొబైల్ ఫోన్‌లకు ఉపయోగపడేలా చేస్తుంది. మొక్కలు విడుదల చేసే ఆర్గానిక్ మెటీరియల్‌ను ఈ చార్జర్ లైట్ ఎనర్జీ నుంచి కెమెకిల్ ఎనర్జీగా మార్చేస్తుంది. ఈ విధానంలో భాగంగా ఒక్కో మొక్క నుంచి ఉత్పత్తయ్యే శక్తి ద్వారా గంటన్నర వ్యవధిలో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా చార్జ్ చేయవచ్చు.అవును..

Read More : సెల్ఫీ స్టిక్ రూ.88కే

‘ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే'. ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో విద్యుత్‌ను సృష్టిస్తున్న రోజులివి. సాధారణంగా ఒక రీచార్జబుల్ బ్యాటరీని చార్జర్ ద్వారా పూర్తిగా చార్జ్ చేయాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ పూర్తి తతంగం పై విసిగివేసారిన Shawn Frayne అనే యూజర్ తన ఆలోచనా పరిజ్ఞానంతో సరికొత్త సోలార్ బ్యాటరీ చార్జర్‌ను రూపొందించారు. ఈ చార్జర్‌కు కరెంట్ అవసరం లేదు. ఎండు నుంచి వెలువడే వెళుతురు నుంచే శక్తిని గ్రహించుకుని బ్యాటరీలను చార్జ్ చేస్తుంది. తక్కువ ఖర్చుతో పేక ముక్కలు ఆధారంగా రూపకల్పన చేయబడిన ఈ సోలార్ బ్యాటరీ చార్జర్ అదరహో అనిపిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ బ్యాటరీ చార్జర్ రూపకల్పనలో భాగంగా షాన్ ఫ్రేన్ ముందుగా పేక ముక్కలతో పాటు, కాపర్ టేప్, సూపర్ గ్లూ, 1/4 "- 1/2" వ్యాసం అలానే 1/32 "- 1/8" మందంతో కూడిన నాలుగు ఎన్‌డి‌ఎఫ్ఈబి మాగ్నెట్‌లు, 4 నుంచి 8 ముడి లేజర్ కట్ పీవీ సిలికాన్ సెల్స్ (సోలార్ పలకలు), జిగురు, అలానే కొన్ని ఏఏ రీచార్జబుల్ బ్యాటరీలను సమీకరించారు.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

తదుపరి చర్యలో భాగంగా పేక ముక్కను రెండు కాళ్ల టేబుల్ తరహాలో బెండ్ చేసారు. సమాంతరంగా వొంచిన పేక ముక్క రెండు కోణాలకు అటు ఇటు కాపర్ టేప్‌ను అతికించారు.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

తదుపరి చర్యలో భాగంగా బ్యాటరీ ప్లే కార్డ్ చార్జర్‌లో సరిగ్గా స్థిరపడే విధంగా నాలుగు మాగ్నెట్‌లను కాపర్ టేప్ అమర్చిన పైనా క్రిందా భాగాల్లో ఒకే ప్రాంతంలో ఫిట్ చేసారు.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

తదుపరి చర్యలో భాగంగా కార్డ్ చార్జర్ పై భాగంలో సోలార్ ప్యానళ్లను సూపర్ గ్లూ సాయంతో అంటించారు.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

తదుపరి చర్యలో భాగంగా తయారైన ప్లే కార్డ్ చార్జర్ మరింత పటిష్టంగా ఉండేందుకు జిగురు సహాయంతో ఓ ప్రత్యేకమైన పొరను చార్జర్ పైనా క్రిందా భాగాల్లో నెలకొల్పారు. (గమనిక: ప్లే కార్డ్ చార్జర్ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన మాగ్నెట్‌ల పై జిగురును వినియోగించవద్దు. అలా చేసినట్లయితే పవర్ సప్లైకు అంతరాయం కలుగుతుంది).

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

వినియోగానికి సిద్ధమైన ప్లే కార్డ్ చార్జర్‌ను ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తరువాత నుంచి వినియోగించటం ప్రారంభించండి.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

సోలార్ బ్యాటరీ చార్జర్‌లో ఏఏ లేదా ఏఏఏ సామర్థ్యం గల రీచార్జబుల్ బ్యాటరీలను అమర్చి ఇలా ఎంట వెళుతురులో ఉంచితే చాలు.. గ్రహించే సోలార్ శక్తి ద్వారా బ్యాటరీ చార్జ్ అవటం ప్రారంభిస్తుంది.

పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్‌ను తయారు చేసే విధానం

వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లేకార్డ్ రీచార్జబుల్ బ్యాటరీ చార్జర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
E-Kaia uses energy from a plant to charge your phone. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot