సామ్‌సంగ్ స్పెషల్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

Posted By:

సామ్‌సంగ్ స్పెషల్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు
సామ్‌సంగ్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ మరో పెద్ద‌స్ర్కీన్ ట్యాబ్లెట్ పై టెక్ ప్రపంచంలో భారీ అంచనాల నెలకున్నాయి. వీటిని సెప్టంబర్- అక్టోబర్ మధ్య ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్, అగష్టు అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తాజాగా, సామ్‌సంగ్ పలు ఎంపిక చేసిన ఉత్పత్తుల పై ఉచిత బహుమతుల పేరుతో కాంబో ఆఫర్‌లను అందిస్తోంది. సామ్‌సంగ్ అందిస్తోన్న కాంబో ఆఫర్ ప్రస్తుతానికి గెలాక్సీ గ్రాండ్, గ్రాండ్ క్వాట్రో, గెలాక్సీ కెమెరా మోడళ్లకు వర్తిస్తోంది.

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

ఈ ఆఫర్‌లలో భాగంగా సెప్టంబర్ 14లోపు గెలాక్సీ గ్రాండ్ (జీటీ-ఐ9082), గ్రాండ్‌క్వాట్రో (జీటీ-ఐ8552) డివైజ్‌లను కొనుగోలు చేసిన వారికి సెన్‌హైసర్ హెడ్‌సెట్‌లను ఉచితంగా అందించనున్నారు. ఈ ఆఫర్ వ్యవధిలో గెలాక్సీ గ్రాండ్‌ను కొనుగోలు చేసిన వారు సెన్‌హైసర్ హెచ్‌డి 202 లేదా సెన్‌హైసర్ హెచ్‌డి 203 మోడల్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. వీటి ధర రూ.2,290 వరకు ఉంటుంది. మరో డివైజ్ గ్రాండ్ క్వాట్రోను ఆఫర్ కాలపరిమితిలోగా కొనుగోలు చేసిన వారికి సెన్‌హైసర్ పీఎక్స్-80 లేదా జేబీఎల టెంపో జేఓ3బి హెడ్‌సెట్‌ను ఉచితంగా అందించనున్నారు. వీటి విలువ రూ.1990 వరకు ఉంటుంది. ఆఫర్ పరిధిలో గెలాక్సీ కెమెరాను కొనుగోలు చేసిన వారికి కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ కిట్‌ను ఉచితంగా అందించనున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. 

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting