పడిలేచిన శాంసంగ్ : కళ్లు చెదిరే ఆఫర్లతో దిగ్గజాలకు షాక్

By Hazarath
|

ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో అత్యంత భారీ నష్టంతో పాటు, అప్రతిష్టను మూటగట్టుకున్న కంపెనీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క శాంసంగ్ మాత్రమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 7, నోట్ 7ఎస్‌లు శాంసంగ్ కు ఘోరమైన ఫలితాలను అందించాయి. ఆ ఫోన్లు ఎక్కడ చూసినా పేలిపోతున్నాయనే విషయంతో శాంసంగ్ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిన విషయం తెలిసిందే. అయితే పోయిన చోటనే రాబట్టుకోవాలంటూ శాంసంగ్ ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్లతో ముందుకు దూసుకొస్తోంది. అదేంటో మీరే చూడండి.

 

మా ఫోన్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: లేకుంటే పెను ప్రమాదం

శాంసంగ్ అద్భుతమైన ఆఫర్

శాంసంగ్ అద్భుతమైన ఆఫర్

గెలాక్సీ నోట్ 7, నోట్ 7 ఎస్ ల కారణంగా వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకుని తిరిగి తలెత్తి నిలబడేందుకు శాంసంగ్ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకోసం భారీ పరిహారం అందిస్తోంది

గెలాక్సీ నోట్ 7 ఎస్ ను వాపస్ చేసిన కస్టమర్లకు

గెలాక్సీ నోట్ 7 ఎస్ ను వాపస్ చేసిన కస్టమర్లకు

ఇప్పటికే ఫోన్ల రీప్లేస్ మెంట్ ను ప్రకటించిన సంస్థ 880 డాలర్లు (సుమారు రూ. 60 వేలు) విలువైన గెలాక్సీ నోట్ 7 ఎస్ ను వాపస్ చేసిన కస్టమర్లకు 440 డాలర్లు (సుమారు రూ. 30 వేలు) విలువైన కూపన్ ఇస్తామని తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 70 వేలు మొబైల్ క్రెడిట్
 

రూ. 70 వేలు మొబైల్ క్రెడిట్

ఇదే సమయంలో సంస్థ మార్కెటింగ్ చేస్తున్న మరో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 70 వేలు మొబైల్ క్రెడిట్ రూపంలో ఇస్తామని పేర్కొంది. యూజర్లకు జరిగిన భారీ అసౌకర్యాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

 కస్టమర్లకు కలిగిన అసౌకర్యాన్ని

కస్టమర్లకు కలిగిన అసౌకర్యాన్ని

తమ కస్టమర్లకు కలిగిన అసౌకర్యాన్ని ఈ విధంగా దూరం చేయాలని శాంసంగ్ చేసిన ప్రకటనకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగింది. ఇటీవలి కాలంలో భారీగా నష్టపోతూ వచ్చిన సంస్థ ఈక్విటీ విలువ నేడు 2.4 శాతానికి పైగా లాభపడింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 బ్యాటరీ తయారీ లోపాలతో

బ్యాటరీ తయారీ లోపాలతో

కాగా బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను గ్లోబల్ గా రీకాల్ చేసింది. రీప్లేస్ చేసిన ఫోన్లు కూడా ప్రమాదానికి గురికావడంతో శాశ్వతంగా వీటికి ముగింపు పలికింది.

తిరుగు ప్రయాణంలో అవి ప్రమాదానికి గురి కాకుండా

తిరుగు ప్రయాణంలో అవి ప్రమాదానికి గురి కాకుండా

గెలాక్సీ నోట్ 7 ఫోన్ల తయారీని ఇప్పటికే ఆపివేసిన సంస్థ, మార్కెట్లోని అన్ని ఫోన్లనూ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో, తిరుగు ప్రయాణంలో అవి ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫైర్ ప్రూఫ్ బాక్సులను, గ్లౌజులను కొనుగోలుదారులకు పంపుతోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు

రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు

రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు పేలుతుండటంతో వాటిని రీప్లేస్ మెంట్ చేసినప్పటికీ, అవి కూడా ప్రమాదకరమని తేలిన సంగతి తెలిసిందే. 

 నాలుగంచెల భద్రత ఉండేలా

నాలుగంచెల భద్రత ఉండేలా

వీటిని వెనక్కు తీసుకునేందుకు నాలుగంచెల భద్రత ఉండేలా నాలుగు కార్టన్ లు, అగ్నికి ఆహుతికాని విధంగా తయారు చేసిన పౌచ్ లను పంపుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫైర్ ప్రూఫ్ బాక్సుల విషయంపై నెటిజన్లు

ఫైర్ ప్రూఫ్ బాక్సుల విషయంపై నెటిజన్లు

ఇక సంస్థ ఫైర్ ప్రూఫ్ బాక్సుల విషయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బాక్సులైనా సరిగ్గా పనిచేస్తాయా? వాటిని టెస్ట్ చేశారా? అంటే శాంసంగ్ ను గేలి చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

శాంసంగ్ ఎటువంటి విమర్శలు చేయకుండా

శాంసంగ్ ఎటువంటి విమర్శలు చేయకుండా

అయినప్పటికీ శాంసంగ్ ఎటువంటి విమర్శలు చేయకుండా కష్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. తమ ద్వారా నష్టపోయిన వారికి ఈ ఆఫర్లు కొంతైనా న్యాయంచేస్తాయని కంపెనీ ధీమాతో ఉంది. మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Samsung offers financial incentives for customers to stem Note 7 bleeding read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X