Home
News

Samsung Debit Card త్వరలోనే చేతిలోకి!!! ఆపిల్,గూగుల్ కార్డులకు పోటీగా...

ప్రముఖ దక్షిణ కొరియా సంస్థ శామ్సంగ్ ఇప్పుడు కొత్తగా పేమెంట్ సర్వీస్ కోసం తన వినియోగదారుల కోసం డెబిట్ కార్డులను విడుదల చేస్తోంది. ఇంతకు ముందే ఆపిల్, హువాయి మరియు గూగుల్ వంటి బ్రాండ్లు వారి పెమెంట్ పోర్టల్స్ యొక్క సేవలను మరింత మెరుగుపరచడానికి డెబిట్ కార్డులను విడుదల చేసాయి.

శామ్సంగ్ పే డెబిట్ కార్డు

శామ్సంగ్ పే డెబిట్ కార్డు

ఈ మూడు సంస్థలకు అన్ని రంగాలలోను గట్టి పోటీని ఇచ్చే శామ్సంగ్ సంస్థ వీటికి పోటీగా తన డెబిట్ కార్డు సేవలను విడుదల చేస్తోంది. శామ్సంగ్ సంస్థ తన వినియోగదారుల కోసం ఇంతకు ముందు శామ్సంగ్ పే అని పిలువబడే పేమెంట్ సర్వీసును విడుదల చేసిన సంగతి అందరికి తెలిసినదే. ఈ వేసవి కాలంలో ఈ కార్డ్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. శాన్-ఫ్రాన్సిస్కోకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ సోఫి భాగస్వామ్యంతో ఈ డెబిట్ కార్డులను తయారు చేయనున్నట్లు తెలిపింది. శామ్‌సంగ్ పే సర్వీస్ యొక్క 5 సంవత్సరాల వేడుకల సందర్భంగా కంపెనీ ఈ శుభవార్తను తన వినియోగదారులకు ప్రకటించింది.

శామ్సంగ్ పే కార్డు పూర్తి వివరాలు

శామ్సంగ్ పే కార్డు పూర్తి వివరాలు

శామ్సంగ్ సంస్థ ఇంతకు మించిన వివరాలు ఏవి కూడా వెల్లడించలేదు. ఏదేమైనా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేసే పేమెంట్ సర్వీస్ ద్వారా ఈ కార్డుకు మద్దతు ఉంటుందని శామ్‌సంగ్ తెలిపింది. శామ్సంగ్ పే కస్టమర్లకు ఈ సర్వీస్ వారి రోజువారీ ఆర్థిక నియంత్రణను పొందడానికి సహాయపడుతుంది. శామ్సంగ్ ఒక సంవత్సరం నుండి ‘మొబైల్-ఫస్ట్ మనీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్'లో పనిచేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కస్టమర్లు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఈ సర్వీస్ సహాయపడుతుందని శామ్సంగ్ అభిప్రాయపడింది.

శామ్సంగ్ పే కార్డు ఫీచర్స్

శామ్సంగ్ పే కార్డు ఫీచర్స్

శామ్సంగ్ పేను మెరుగ్గా మరియు మరింత మందికి యాక్సిస్ ను అందివ్వడానికి గత ఐదు సంవత్సరాలుగా శామ్సంగ్ అనేక భాగస్వామ్యాలను చేసింది. ఈ రోజు ఇది ఎక్కువగా ఉపయోగించే పేమెంట్ సర్వీస్ పోర్టల్ కాదు కానీ దీనికి MST మద్దతు ఉంది. వినియోగదారులకు రివార్డ్ ప్రోగ్రామ్‌ను అందించే ప్లాట్‌ఫామ్‌లలో శామ్‌సంగ్ పే కూడా ఒకటి. ఇది ప్రజలు వారి యొక్క సేవలను ఉపయోగిస్తున్నప్పుడు కాలక్రమేణా రివార్డ్ పాయింట్లను ఉత్పత్తి చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అలాగే రివార్డులను క్లెయిమ్ చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఎంపిక చేసిన రిటైలర్లతో చేసిన కొనుగోళ్లపై వినియోగదారులకు 12 శాతం క్యాష్‌బ్యాక్ అందించే కొత్త క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకువచ్చారు.

శామ్సంగ్ పే కార్డు Vs ఆపిల్ కార్డు

శామ్సంగ్ పే కార్డు Vs ఆపిల్ కార్డు

శామ్సంగ్ పే కార్డు నేరుగా ఆపిల్ కార్డుతో పోల్చదగినదిగా అనిపించినప్పటికీ ఇందులో చాలా తేడాలు ఉన్నాయి. ఆపిల్ యొక్క క్రెడిట్ కార్డు వలె కాకుండా శామ్సంగ్ పే కార్డ్ అనేది డెబిట్ కార్డు. ఈ రెండింటిలో సారూప్యత ఏమిటంటే ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంకింగ్ సేవతో ముడిపడి ఉన్నాయి. శామ్సంగ్ సంస్థ సోఫీతో మరియు ఆపిల్ కోసం గోల్డ్మన్ సాచ్స్ తో కలిసి ఈ కార్డులను తయారుచేస్తున్నారు. శామ్సంగ్ కార్డుతో పాటు మరిన్ని సేవలను ప్రారంభించడం ద్వారా కంపెనీ ప్లాట్‌ఫామ్‌ను మరింత పెంచుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Plans to Launch Debit Card
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X