Samsung కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేసాయి...ధరల మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలో శామ్సంగ్ సంస్థకు మంచి పేరు ఉంది. ప్రజలు ఎక్కువగా విశ్వసించే బ్రాండ్లలో ఇది కూడా ఒకటి. ఈ శామ్సంగ్ సంస్థ ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీల వరకు అన్ని రకాల ఉత్పత్తులను తయారుచేయడమే కాకుండా వాటన్నిటికి కూడా మంచి ఆదరణను పొందుదుతున్నాయి.

శామ్సంగ్ కొత్త టీవీలు
శామ్సంగ్ సంస్థ ఇప్పుడు ఇండియాలో కొత్తగా తన బడ్జెట్ స్మార్ట్ టీవీలను మరియు ఫ్రేమ్ టీవీలను విడుదల చేసింది. ఈ టెక్ దిగ్గజం శామ్సంగ్ తన కొత్త స్మార్ట్ టీవీలను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా మరియు శామ్‌సంగ్ యొక్క అధికారిక వెబ్ సైట్ యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీల యొక్క సేల్స్ ను జూన్ 19 నుండి ప్రారంభించనున్నది. శామ్సంగ్ ఫ్రేమ్ 2020 స్మార్ట్ టీవీలను విడుదల చేసారు. వినియోగదారులు వారి యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆఫర్లతో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: Nokia 5310: అతి తక్కువ ధరలో గొప్ప ఫీచర్లతో సరైన ఎంపిక ఇదే...

శామ్సంగ్ ఫ్రేమ్ 2020 టీవీ ధర మరియు లభ్యత వివరాలు
శామ్సంగ్ ఫ్రేమ్ 2020 ఆన్‌లైన్ అమ్మకాలలో భాగంగా శామ్‌సంగ్ షాప్ మరియు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా సేల్స్ మొదలుకానున్నాయి. మూడు వేర్వేరు పరిమాణాలలో వినియోగదారులకు ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ వేరియంట్‌లలో 50-అంగుళాల మోడల్ యొక్క ధర రూ.74,990, 55-అంగుళాల మోడల్ ధర రూ.84,990 మరియు చివరిది 65-అంగుళాల మోడల్ ధర రూ.1,39,990. ఈ స్మార్ట్ టీవీలు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీతో పాటు రెండు సంవత్సరాల సమగ్ర వారంటీతో పాటు వస్తుంది. Also Read:Redmi Note 9 Pro Sale ఎయిర్‌టెల్ ఆఫర్లతో పాటు మరిన్ని ఆఫర్స్!!!

శామ్సంగ్ కొత్త స్మార్ట్ టీవీల ధరల వివరాలు
శామ్‌సంగ్ సంస్థ కొత్తగా ప్రారంభించిన స్మార్ట్ టీవీలలో హెచ్‌డీ-రెడీ మరియు ఫుల్-హెచ్‌డీ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ కొత్త టీవీలు శామ్సంగ్ ఫ్రేమ్ 2020 టీవీకి పూర్తి బిన్నంగా తక్కువ ధరను కలిగి ఉన్నాయి. వీటిలో 32 అంగుళాల ప్రారంభ మోడల్ యొక్క ధర 14,490 రూపాయలు, అలాగే 43 అంగుళాల HD వేరియంట్ యొక్క స్మార్ట్ టీవీ ధర 31,990 రూపాయలు. అలాగే 43 అంగుళాల వేరియంట్ యొక్క 4K UHD స్మార్ట్ టివి యొక్క ధర రూ.36,990, అలాగే 65 అంగుళాల 4K UHD స్మార్ట్ టివి వేరియంట్ ధర 89,990 రూపాయలు. ఈ కొత్త మోడళ్లన్నీ ప్యానెల్‌లో ఒక సంవత్సరం "సమగ్ర" వారంటీ మరియు ఒక సంవత్సరం అదనపు వారంటీతో వస్తాయి.

శామ్సంగ్ ఫ్రేమ్ టివి 2020 సేల్ ఆఫర్స్
శామ్సంగ్ ఫ్రేమ్ టివి 2020 యొక్క సేల్స్ జూన్ 19 నుండి మొదలుకానున్నాయి. ఈ కొత్త స్మార్ట్ టివి మోడళ్లను విక్రయించిన మొదటి 48 గంటల్లో కొనుగోలు చేసిన వారికి 1,500 రూపాయల తగ్గింపు లబిస్తుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ కొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను కొనుగోలు చేసే SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 1,000 ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్ కూడా అదనంగా లభిస్తుంది. అలాగే ఎటువంటి ఖర్చులేని నో-కాస్ట్ EMI ఎంపికల ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ కొత్త టీవీల సేల్స్ అదనపు ఆఫర్స్
శామ్సంగ్ యొక్క ఫ్రేమ్ టీవీ 2020 లేదా స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,095 విలువైన ఈరోస్ నౌ మరియు Zee5 వంటి OTT యాప్ ల చందాలపై 50 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. ఈ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు గానా ప్లస్‌కు ఒక సంవత్సరం మరియు ఆపిల్ మ్యూజిక్‌కు మూడు నెలల చందాను ఉచితంగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








