పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం

Posted By:

పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం..ఏందీ నమ్మలేకున్నారా..ఇది నిజం.. ఇక ఫేస్‌బుక్ లో కాని ట్విట్టర్ లో కాని ఏవైనా వదంతులు పుకార్లు లాంటివి పోస్ట్ చేస్తే తలలు నరికేస్తారట..లేకుంటే ఏకంగా ఉరిశిక్షనే విధిస్తారట..అయితే ఇది మన ఇండియాలో కాదు..చట్టాలను కఠినంగా అమలుచేస్తున్న ఎడారి దేశం సౌదీ అరేబియాలో..ఈ మధ్యనే అక్కడి యువరాజు ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వెబ్ సైట్లలో పెట్టారు.మరి ఎందుకనేగా మీ ప్రశ్న..సమాధానం స్లైడర్ లో చూడండి.

Read more:చంద్రునిపై అమెరికా తొలి అడుగు ఓ బూటకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరణ శిక్ష విధిస్తారట

మరణ శిక్ష విధిస్తారట

ఫేస్ బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా..ఇక్కడైతే ఏమోకాని సౌదీ అరేబియాలోఅయితే మాత్రం మరణ శిక్ష విధిస్తారట.ఈ విషయాన్ని అక్కడిప్రభుత్వం వెబ్ సైట్ లో అధికారికంగా ప్రకటించారు.

సామాన్య ప్రజల్లో ఆందోళన

సామాన్య ప్రజల్లో ఆందోళన

ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది.ఈ ప్రకటన వెనుక మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు.

సల్మాన్ పాలనలో మరణ శిక్షల జోరు

సల్మాన్ పాలనలో మరణ శిక్షల జోరు

కొత్త రాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది, సౌదీ రాజు నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో..

ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో..

ఇటీవల హాజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యి మంది వరకు చనిపోవడం దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందనే సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష మొదటిసారి

వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష మొదటిసారి

ఇప్పటి వరకు చిన్నపాటి తప్పులు చేసిన వారికి ఖైదు,ప్రయాణ నిషేధం,గృహ నిర్భంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయవాది అంటున్నారు.

కొన్ని వారాల క్రితం

కొన్ని వారాల క్రితం

ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ యువరాజు ప్రకటించారు.

జనం నుంచి తీవ్ర వ్యతిరేకత

జనం నుంచి తీవ్ర వ్యతిరేకత

79 ఏళ్ల కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం

మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం

మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. మరి ముందు ముందు ఈ ప్రకటన ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

సౌదీ సర్కారు ఇతనికి శిలువ

సౌదీ సర్కారు ఇతనికి శిలువ

ఆలీ మహమ్మూద్ అనే కుర్రాడు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు..దీంతో పాటు అక్కడ మాట్లాడినందుకు సౌదీ ప్రభుత్వం ఇతన్ని 2112న జైల్లో బంధించింది. తన బ్లాక్ బెర్రి ఫోన్ తో అనేకమందిని ఆందోళనలోకి తీసుకువచ్చాడని సౌదీ సర్కారు ఇతనికి శిలువ వేసింది.

మక్కా ఆన్ లైన్ వెబ్ సైట్

మక్కా ఆన్ లైన్ వెబ్ సైట్

సౌదీవెబ్ సైట్ ది మక్కా ఆన్ లైన్ లో ఉంచిన ప్రకటన ఇదే ..ఇక ఇతనే మహమ్మది బిన్ సల్మాన్ యువరాజు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Saudi Arabia warns Twitter and Facebook 'rumour-mongers' they risk DEATH PENALTY
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot