320జీబి స్టోరేజ్‌తో ఆండ్రాయిడ్ ఫోన్

Posted By:

ఏకంగా 320జీబి మెమరీ సామర్థ్యంతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సేగస్ (Saygus) అనే సంస్థ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 టెక్ ఎక్స్‌పో వేదికగా ప్రకటించింది. సేగస్ వీ2 (సేగస్ వీస్క్వేర్డ్)గా వ్యవహరించబడుతోన్న ఈ ఫోన్ 64జీబి ఆన్‌బోర్డ్ ఫ్లాష్ మెమరీతో పాటు రెండు 128జీబి మెమెరీ కార్డ్‌స్లాట్‌లను కలిగి ఉంటుంది. యూజర్ ఈ మొత్తాన్ని వినియోగించుకున్నట్లయితే 320జీబి మెమరీ స్టోరేజ్ అతని జేబులో ఉన్నట్లే.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వామ్మో.. ఆ ఫోన్ మెమరీ స్టోరేజ్ 320జీబి!

సేగస్ స్క్వేర్డ్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 60గిగాహెర్ట్జ్ వై-ఫై బ్యాండ్ సపోర్ట్, హార్మన్ కార్డాన్ స్పీకర్ వ్యవస్థ, బ్యాటరీ సేవింగ్ చిప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వైర్‌లెస్ చార్జింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

తెలుగు టైపింగ్ స్మార్ట్‌ఫోన్ యాప్స్

తొలత ఈ ఫోన్‌ను అమెరికా మార్కెట్లో విడుదల చేయునున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ని ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర కేవలం 100 డాలర్లు మాత్రమేనట. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.6,400 మాత్రమే!!

English summary
CES 2015: An Android smartphone with 320GB storage. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot