Home
News

ఐన్‌స్టీన్ తరంగాలకు కొత్త ఊపిరి

By Hazarath

గురుత్వాకర్షణ శక్తి తరంగాలు సరిగ్గా వందల ఏళ్ల క్రితం ఐన్ స్టీన్ ప్రతిపాదించిన ఈ తరంగాల ఉనికి ఇంతకాలం ఒక సిద్ధాతంగానే మిగులుంది.ఈ తరంగాలు ఉనికి గ్రావిటేషన్ రేడియేషన్ రూపంలో శక్తిని రవాణా చేస్తాయని ఓ అంచనా ఉండేది. అయితే ఇప్పటిదాకా ఈ తరంగాలు ఉన్నాయా లేవా అన్న మీమాంస ఉండేది. ఒక వేళ ఈ తరంగాలు ఉన్నట్లు రుజువైతే ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం రుజువైనట్లే. విశ్వంలో ఎన్నో రహస్యాలను ఇప్పుడు తెలుసుకునే వీలుంది.

Read more: హ్యాకర్ల బంపర్ ఆఫర్ : ఒక్క లాగిన్‌ ఇస్తే లక్షలకు లక్షలు

అసలు తరంగాలు ఉన్నాయో లేవో ఇప్పటిదాకా

అసలు తరంగాలు ఉన్నాయో లేవో ఇప్పటిదాకా

అసలు తరంగాలు ఉన్నాయో లేవో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. చూసినవారెవరూ లేరు. కృష్ణబిలాల పుట్టుక విధ్వంస సమయాల్లో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ జనించి సుదూర గెలాక్సీల గుండా ప్రయాణిస్తాయని ఒక ఊహ.కానీ చరిత్రలో తొలిసారిగా ఆ తరంగాల ఉనికిని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషన్ వేవ్ అబ్జర్వేటరీ శాస్ర్తవేత్తలు కనుగొన్నారు.

కృష్ణబిలాల గురుత్వాకర్షణ శక్తి అమోఘమనే విషయం

కృష్ణబిలాల గురుత్వాకర్షణ శక్తి అమోఘమనే విషయం

ఈ కృష్ణబిలాల గురుత్వాకర్షణ శక్తి అమోఘమనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రెండు కృష్ణబిలాలు ఢీకొనే సమయంలోనూ న్యూట్రాన్ తారలు ఢీకొనేటప్పుడు సూపర్ నోవాలు అంటే నక్షత్ర పేలుడులు సంభవించినప్పుడు గురుత్వాకర్షణ తరంగాలు జనించి విస్తరిస్తాయని ఒక ఊహ ఉండేది.

ఊహలను నిజం చేయాలని పేలుడు సమయంలో

ఊహలను నిజం చేయాలని పేలుడు సమయంలో

ఆ ఊహలను నిజం చేయాలని పేలుడు సమయంలో గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనాలనే ఉద్దేశంతో యూఎస్ లో లిగోను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రపంచంలోని 15 దేశాలకు చెందిన 1000 మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. 2002 నుంచి చేస్తున్న వీరి ప్రయోగ పరిశోధనలు ఫలించాయి.

వీరి పరిశోధనలతో విశ్వం పుట్టుకనాటి రహస్యాలను

వీరి పరిశోధనలతో విశ్వం పుట్టుకనాటి రహస్యాలను

వీరి పరిశోధనలతో విశ్వం పుట్టుకనాటి రహస్యాలను తెలుసుకొనగలిగే పరిశోధనకు బీజం పడింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి

130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి

దాదాపు 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి.. అంతరిక్షంలోకి విస్తరిస్తున్న ఈ తరంగాల ఉనికిని నిర్ధారించుకున్నట్లు యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కార్డోవా వెల్లడించారు.ఇప్పటివరకూ గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని.. కానీ ఆధారపూర్వకంగా తొలిసారిగా గుర్తించామని తెలిపారు.

విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను

విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను

దీనిద్వారా విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవచ్చని చెప్పారు. 1916లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా లెక్కించగలిగిన గురుత్వాకర్షణ తరంగాలు.. తాము గుర్తించిన తరంగాలు కచ్చితంగా సరిపోలాయని ‘లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)'లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ షూమాకర్ చెప్పారు.

బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను

బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను

బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను.. కృష్ణబిలాలను దీని ద్వారా పరిశోధించవచ్చని తెలిపారు. కాగా ఈ పరిశోధనలో పాలుపంచుకున్న భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ అభినందించారు. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం గొప్ప ముందడుగని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఏమిటీ పరిశోధన..?

ఏమిటీ పరిశోధన..?

నక్షత్రాలకు, కృష్ణ బిలాలకు గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు, కృష్ణబిలాలు ఢీకొన్నప్పుడుగానీ, పేలినప్పుడుగానీ గురుత్వాకర్షణ తరంగాలు వెలువడతాయని అంచనా.

అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే

అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే

అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే అతి భారీ ద్రవ్యరాశుల గమనాన్ని వీటి ద్వారా నిర్ధారించవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలను ఏదీ అడ్డుకోలేదు. నీటిలో రాయి వేసినప్పుడు ఏర్పడే అలల్లా ఇవి విస్తరిస్తాయని అంచనా.

ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో

ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో

ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)' పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్లను హాన్‌ఫోర్డ్, లివింగ్‌స్టన్ ప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించారు.

ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి

ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి

వీటి సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి. అవి ఢీకొన్నప్పుడు వెలువడి స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి.

ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు

ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు

ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.21 గంటలకు) ‘లిగో'లోని పరికరాలు గురుత్వాకర్షణ తరంగాలకు తొలి ఆధారాన్ని సంపాదించాయి. తొలుత లివింగ్‌స్టన్‌లో ఉన్న డిటెక్టర్ ఈ తరంగాలను గుర్తించింది. అక్కడికి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హాన్‌ఫోర్డ్‌లోని డిటెక్టర్ 7.1 మిల్లీ సెకన్ల తర్వాత గుర్తించింది.

ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో

ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో

ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో నమోదైంది కూడా. అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు 5 నెలల సమయం పట్టింది. అయితే ఈ గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన పరోక్ష ఆధారాలను 1974లోనే ఓ న్యూట్రాన్ నక్షత్రంపై పరిశోధన చేసినప్పుడు గుర్తించారు.

 

 

Best Mobiles in India

English summary
Here Write Scientists Observe Gravitational Waves For The First Time, Confirming Einstein s Theory
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X