హ్యాకర్ల బంపర్ ఆఫర్ : ఒక్క లాగిన్‌ ఇస్తే లక్షలకు లక్షలు

Written By:

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ సంస్థ ఆపిల్‌ను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆపిల్ ఉద్యోగులకు గాలం వేస్తున్నారు. ఆపిల్ ను దెబ్బ తీయాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలను కుమ్మరించడానికి వెనుకాడటం లేదు.

Read more: ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లు ఇవే

హ్యాకర్ల బంపర్ ఆఫర్ : ఒక్క లాగిన్‌ ఇస్తే లక్షలకు లక్షలు

యాపిల్ ఉద్యోగులకు వల విసురుతూ ఒక్క లాగిన్ ఐడీ పాస్ వర్డ్ ఇస్తే లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ లెవల్ లోని ఉద్యోగులకు అప్పుడే చేరిన వారికి ఈ తరహా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను కాంటాక్ట్ చేసే హ్యాకర్లు వారిని లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక యాపిల్ లో ఎంత మంది ఉద్యోగులకు ఈ తరహా ఆఫర్లు వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Read more : సెకండ్‌కు లక్షా 26వేల రూపాయల లాభం

హ్యాకర్ల బంపర్ ఆఫర్ : ఒక్క లాగిన్‌ ఇస్తే లక్షలకు లక్షలు

నా లాగిన్ వివరాలు చెబితే 20 వేల యూరోలు ఇస్తామన్నారు.నేను కావాలంటే ఇప్పుడే నా లాగిన్ ఐడీ పాస్ వర్డ్ అమ్మేసుకోవచ్చంటూ ఓ ఉద్యోగి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విషయం ఆపిల్ కు తెలుసని ఉద్యోగులను ఈ తరహా చర్యలకు దూరం చేసేందుకు గ్రో యువర్ ఓన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని యాజమాన్యం ప్రారంభించిందని ఆ ఉద్యోగి తెలిపారు. ఈ సంధర్భంగా ఆపిల్ రహస్యంగా  తయారు చేస్తున్న ఐ కార్ల ప్రాజెక్ట్‌ను చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ ఫోన్లతో మార్కెట్‌ను షేక్ చేసిన

ఐ ఫోన్లతో మార్కెట్‌ను షేక్ చేసిన

ఐ ఫోన్లతో మార్కెట్‌ను షేక్ చేసిన ఆపిల్ త్వరలో ఐ కార్లతో మార్కెట్ లోకి దూసుకురానుందా.. ప్రజలను త్వరలోనే యాపిల్ కార్లు పలకరించనున్నాయా..అంటే ఓౌననే సమాధానం వస్తోంది. ఆపిల్ కంపెనీ గత డిసెంబర్లో కార్ల పేరిట డొమైన్ రిజిస్టర్ చేసుకుంది.

 

 

డొమైన్ లో ఆపిల్ కంపెనీ రిజిస్టర్

డొమైన్ లో ఆపిల్ కంపెనీ రిజిస్టర్

యాపిల్ .కార్ .యాపిల్.కార్స్, యాపిల్. ఆటో వంటి పేర్లను డొమైన్ లో ఆపిల్ కంపెనీ రిజిస్టర్ చేసుకుందని డొమైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ వూ. యిజ్ తెలిపింది.

 

 

ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని

ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని

అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని వినిపిస్తోంది. కారు నడిపించేటప్పుడు స్టీరింగ్ వీల్ నుంచి చేతులు తీయకుండానే ఐఫోన్లో కాల్స్, వాయిస్ మెయిల్స్ వినేందుకు వినియోగదారులకు ఈ సర్వీసు వీలు కల్పిస్తుంది.

 

 

ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున

ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున

మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున కంపెనీలో చేర్చుకుంటున్న యాపిల్ .. తనకు కారును రూపొందించే ఆలోచన ఉందని మాత్రం బహిరంగంగా ఒప్పుకోవడం లేదు.

 

 

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను చేర్చుకోవడం ద్వారా యాపిల్ ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది. సిలికాన్ వ్యాలీకి చెందిన గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పుడు కారు టెక్నాలజీ మీదనే ప్రధానంగా దృష్టి సారించాయి.

 

 

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని 2014లో టిమ్ కుక్ అనౌన్స్ చేశారు కూడా . దీన్ని ప్రాజెక్టు టైటాన్ అని కూడా పిలుస్తున్నారు. దీన్ని కాలిఫోర్నియాలో ఆపిల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేశారు.

 

 

ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి

ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి

గూగుల్ సెల్ప్ డ్రైవింగ్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చినట్టే ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి తీసుకురావాలని ఆ మీటింగ్ లో డిస్కస్ చేశారు. ఈ నేపధ్యంలో ఆపిల్ కంపెనీ కూడా ఇలాంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లమీదనే మోజు పెట్టినట్లు తెలుస్తోంది.

 

 

వస్తే గిస్తే కనుక 2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు

వస్తే గిస్తే కనుక 2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు

వస్తే గిస్తే కనుక 2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 600 మంది ఆటోమేటివ్ ఇంజనీర్లు పనిచేస్తున్నారని సమాచారం. టెస్లా,మెర్సిడెంజ్ బెంజ్ కార్లు తయారుచేసిన ఇంజనీర్లు ఈ ఐ కార్లను తయారుచేసే పనిలో ఉన్నారని కూడా సమాచారం.

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా ఈ కార్ల తయారీ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. మరి నిజంగా యాపిల్ కార్లు వస్తాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Hackers are offering Apple employees in Ireland up to €20,000 for their login details
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot