భూగ్రహం వైపు భారీ గ్రహశకలం వస్తోంది
భూగ్రహం వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకువస్తోంది. 2015 టీబీ 145 అనే గ్రహశకలం ఇవాళ భూమికి చేరువగా వస్తుందని ఖగోళ శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. దాదాపు 13 వందల అడుగుల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెకనుకు 35 కిలోమీటర్ల వేగంతో భూమికి పక్కగా వెళ్తుందని అంటున్నారు.
Read more: ఆకాశంలో గూగుల్ హై స్పీడ్ ఇంటర్నెట్

గ్రహశకలాల గురించి మరించి సమాచారం సేకరించడానికి ఇది సరైన సమయమని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. ఈ భారీ గ్రహ శకలం భూమికి చేరువగా వెళ్లనుంది. దాని సైజ్ న్యూయార్క్ ట్రంప్ టవర్ కన్నా రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందట.
Read more : క్రియేటివ్ ఛార్జింగ్ స్టేషన్స్

గంటకు 78వేల మైళ్ల వేగంతో ఆ గ్రహశకలం వెళ్లనుంది. భూమికి మూడులక్షల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహశకలం ప్రయాణించనుంది. దీని వల్ల భూమికి ఎటువంటి నష్టం ఉండదు. ఓ భారీ గ్రహశకలం భూమికి ఇంత చేరువగా వెళ్లడం అరుదుగా జరుగుతుంది.
Read more: చంద్రునిపై ఏలియన్స్ పదే పదే నన్ను రేప్ చేసాయి

మళ్లీ ఇలాంటి అద్భుతం 2027లో కనిపిస్తుందట. ఈ గ్రహశకల గమనాన్ని ఆన్‌లైన్ అబ్జర్వేటరీ డాట్‌కామ్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.


Click it and Unblock the Notifications








