గూగుల్ ప్లస్‌లో కొత్త పేజీ 'లైఫ్ ఎట్ గూగుల్'

Posted By: Super

గూగుల్ ప్లస్‌లో కొత్త పేజీ 'లైఫ్ ఎట్ గూగుల్'

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌లో 'గూగుల్‌ వద్ద జీవితం' పేజిని ప్రారంభించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ప్రొపైల్స్‌ని కలిగి ఉన్న వారు 'గూగుల్‌ వద్ద జీవితం' పేజిని షేర్ చేసుకోవచ్చని అన్నారు. యూజర్స్ ఈ పేజిలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతో పాటు, వాతావరణం, సంస్కృతి మొదలగున వాటికి సంబంధించి పోస్ట్ చేయవచ్చు.

గూగుల్ వద్ద జీవితం ఎకౌంట్స్‌ని గూగుల్ కంపెనీ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఫాలో అవ్వోచ్చని తెలిపింది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ గూగుల్ ప్లస్‌ని 'బేబి' లాగా  చూసుకుంటుంది. గూగుల్ వద్ద జీవితం ఎకౌంట్ గూగుల్ సోషల్ మీడియాలో త్వరలో అత్యంత కీలక పాత్రని పోషించనుంది. గూగుల్ అధికారకంగా గూగుల్ వద్ద జీవితం పేజి గురించి సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

గూగుల్ ప్లస్‌లో గూగుల్ వద్ద జీవితం పేజిని విడుదల చేసిన ఆరు గంటలలోపే 2800 సర్కిల్స్ ఏర్పడ్డాయి. ఇక ఫేస్‌బుక్‌లో 27,817 ఇష్టాలు.. ట్విట్టర్‌లో 133,750 ఫాలోవర్స్ ఫాలో అయ్యారు. ఇటీవలే ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కంపెనీలలో పనిచేసేందుకు సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఉత్తమ కంపెనీ అని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. 2012 ఏడాదిలో 100 బెస్ట్ కంపెనీల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచిందని ఫార్చ్యూన్ తెలిపింది. వర్క్ కల్చర్ మొదలుకుని ఉచిత ఆహారం దాకా ఉద్యోగులకి కల్పించే సదుపాయాలన్నింటి విషయాల్లోనూ గూగుల్ ఉత్తమంగా ఉందని ఫార్చ్యూన్ ఇటీవల తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot