ఆ కార్లకు హ్యాకింగ్ షాక్

Written By:

టెక్నాలజీ రోజు రోజుకు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు అన్నీ మిషన్లే చేసే పరిస్థితి వస్తోంది. ఈ కోవలోనే రానున్న కాలంలో డ్రైవర్ లేకుండా నడిచే కార్లు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్లు సేఫ్ గా ఉంటాయా...?గమ్యస్థానాలకు చేరుస్తాయా..ఇలా ఎన్నో అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.అయితే అన్నింటికన్నా ఇప్పుడు ఓ వార్త అందర్నీ షాకింగ్ కు గురిచేస్తోంది. ఈ కార్లు హ్యాకింగ్ గురవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Read more: చెత్త పాస్‌వర్డ్స్‌తో సింగపూర్‌కి చుక్కలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారికి ప్రపంచవ్యాప్తంగా

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ డ్రైవర్ లెస్ కార్లను తయారుచేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదనే చెప్పాలి.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు

అయితే వాటి వల్ల సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అమెరికా ఆటోమొబైల్ రంగానికి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చి చెప్పారు.

ఎక్కడో మారుమూల ప్రాంతాల (రిమోట్) నుంచి

ఇలాంటి కార్లను ఎక్కడో మారుమూల ప్రాంతాల (రిమోట్) నుంచి కూడా హ్యాకింగ్ చేయవచ్చని, కారు ఇంజిన్, బ్రేకులు, ఇతర పరికరాలను ఇతరులు తమ ఆధీనంలో తీసుకొనే ముప్పు పొంచి ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.

ఈ కార్ల తయారీలో ఉపయోగించే అత్యాధునిక కంప్యూటర్‌లు

ఈ కార్ల తయారీలో ఉపయోగించే అత్యాధునిక కంప్యూటర్‌లు, సెన్సర్‌లు, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ లాంటి సాంకేతిక పరిఙ్ఞానమే హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలను పెంచుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టిఫాన్ సావేజ్ తెలిపారు.

సుమారు 30 కంప్యూటర్లకు ఇంటర్నెట్ నెట్‌వర్క్ ద్వారా

అత్యంత ఆధునాతన కార్లలో ఉండే సుమారు 30 కంప్యూటర్లకు ఇంటర్నెట్ నెట్‌వర్క్ ద్వారా లోనికి చొరబడటానికి అవకాశముందని, బ్రేకుల నుంచి రేడియో వరకు ఎలాంటి పరికరాన్నైనా హ్యాకర్ తన ఆధీనంలోకి తీసుకోవడానికి మార్గాలున్నాయని మిచిగాన్ టెక్నాలజీ రివ్యూ అనే పత్రిక తెలిపింది.

బ్రేక్ కంట్రోల్ సిస్టం, సెంట్రల్ లాకింగ్ విధానం

డ్రైవర్ లేని కార్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ, సెన్సర్లు, కంప్యూటర్లు అదనపు బలంగా మారాయో.. అంతే మొత్తంలో బలహీనతలు కూడా ఉన్నాయని స్టిఫాన్ సావేజ్ పేర్కొన్నారు. బ్రేక్ కంట్రోల్ సిస్టం, సెంట్రల్ లాకింగ్ విధానం కోసం ఎలాంటి సాఫ్ట్‌వేర్ వాడుతున్నారో ఉత్పత్తిదారులకు అవగాహన ఉండకపోవడం అనేక సమస్యలు తెలుత్తుతాయన్నారు.

లేజర్ స్కానర్లు, ఇతర సెన్సర్ల ఆధారంగానే

లేజర్ స్కానర్లు, ఇతర సెన్సర్ల ఆధారంగానే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు పనిచేస్తాయని, అవే హ్యకింగ్‌కు ప్రధాన కారణాలుగా మారాయని పరిశోధకులు పేర్కొన్నారు. హ్యాకింగ్ ద్వారా కారులోని బ్రేకులు, ఇతర ముఖ్యమైన వ్యవస్థను హ్యాకర్లు వారి చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయ్ అని సంబరపడిపోతున్న జనాలను

డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయ్ అని సంబరపడిపోతున్న జనాలను ఈ పరిశోధన ఫలితాలు కలవరపెడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Self Driving Cars May Face Increased Hacking Risk: Study
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot