దారుణమైన నష్టాల్లో ఆపిల్: గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

Written By:

గత 13 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఆపిల్ ఒక్కసారిగా అమ్మకాల్లో కుదేల్ అయింది. ఐ ఫోన్ అమ్మకాల విషయంలో ఎంత కొత్తగా ప్రయత్నిస్తున్నప్పటికీ టెక్ దిగ్గజం మార్కెట్లో చతికిలపడుతూనే ఉంది. ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఐ ఫోన్ అమ్మకాలు పడిపోయాయి. గత 13 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితులను చవిచూస్తున్నామని కంపెనీ ప్రకటించింది. మరి ఎందుకు అలా జరిగింది. దీనిపై టీం కుక్ ఏమంటున్నారు ఓ సారి చూద్దాం.

Read more : షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

ఆపిల్ సంస్థకు ప్రతిష్టాత్మక మార్కెట్లు అమెరికా, చైనా, ఇండియాలు మాత్రమే.అయితే ప్రస్తుతం చైనాలో 25శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని, త్వరలో మరో 25శాతం కూడా తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆపిల్ మార్కెట్లో కుదేలయిపోయింది.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

ఆపిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్ముందు రాని, ఇంతకుముందు లేని ఒక కొత్త ఆవిష్కరణతో, ఉత్పత్తితో తప్పక ముందు రావాలి. ఇప్పుడు సరిచేసుకుంటున్న చిన్నచిన్న మార్పులతో అమ్మకాలు పెంచలేరు. కొత్త ఉత్పత్తి మాత్రమే ఐఫోన్ అమ్మకాల జోరును పెంచడానికి సరైన మార్గం' అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

ఇక ఆపిల్ సీఈఓ టీం కుక్ దీనిపై పూర్తిగా నిరాశను వ్యక్తం చేశారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ టెలికం నెట్ వర్క్‌లో తగినంత వేగం లేకపోవడం, రిటైల్ షోరూమ్‌ల స్వరూపం అస్తవ్యస్తంగా ఉండటం వంటివి తమకు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

తమ కంపెనీ భారత్ మార్కెట్లో జోరును ప్రదర్శించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. గడిచిన 13 ఏళ్లలో యాపిల్ ఆదాయం తొలిసారి క్షీణించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్. అయితే, స్లో నెట్‌వర్క్, కొనుగోలు శక్తి వంటి అంశాలతో ఇక్కడ చౌక స్మార్ట్‌ఫోన్‌ల హవానే కొనసాగుతోంది. అందుకే మా స్థాయికి తగ్గట్లుగా తగినంత మార్కెట్ వాటాను సంపాదించలేకపోతున్నాం.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

అయితే, పదేళ్లక్రితం చైనాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్‌లోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క' అని కుక్ పేర్కొన్నారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

కాగా, అమెరికా తర్వాత యాపిల్‌కు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో మార్చి క్వార్టర్ ఐఫోన్‌ల అమ్మకాలు 11 శాతం పడిపోగా, భారత్‌లో మాత్రం 56 శాతం ఎగబాకడం గమనార్హం.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

బారత్‌లో ఇంకా 4జీ(ఎల్‌టీఈ) నెట్‌వర్క్ ఈ ఏడాదే పూర్తిస్థాయిలో ఆరంభమైందని.. రానున్న కాలంలో ఈ మరిన్ని కంపెనీలు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచితే తమకు మంచి అవకాశాలు లభిస్తాయని కుక్ చెప్పారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌ల శక్తిసామర్థ్యాలు 4జీ వంటి వేగవంతమైన నెట్‌వర్క్‌లతోనే వినియోగదారులకు తెలిసొస్తాయన్నారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

గత మార్చి క్వార్టర్‌లో 6.2 కోట్ల ఐఫోన్లు అమ్ముడవగా.. ఈ మార్చి త్రైమాసికంలో 5.2 కోట్ల ఫోన్లను కంపెనీ విక్రయించింది. కాగా, ఫలితాలపై కుక్ స్పందిస్తూ... ఇదేమంత పెద్ద ప్రతికూలాంశం కాదని.. యాపిల్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

మరి ముందు ముందు ఆపిల్ మార్కెట్లో పరుగులు తీస్తుందా లేక ఇంకా దారుణ ఫలితాలు మూటగట్టుకుంటుందా అనేది రానున్న రోజుల్లో కంపెనీ నుంచే వచ్చే ఉత్పత్తిపైన ఆధారపడి ఉందని విశ్లేషకులు సెలవిస్తున్నారు.

ఆపిల్ కుదేల్ : గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Slow networks in India preventing Apple from full bloom: Tim Cook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot