స్మార్ట్ ఏటీఎమ్‌లు వచ్చేస్తున్నాయ్

|

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏటీఎమ్ మెచీన్లను రీప్లేస్ చేస్తూ సరికొత్త స్మార్ట్ ఏటీఎమ్‌లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం గత 9-10 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న ఆటోమేటెడ్ టెల్లర్ మెచీన్లను సెక్యూరిటీ అంశాల దృష్ట్యా కొత్త మెచీన్లతో రీప్లేస్ చేయబోతున్నారు.

 
స్మార్ట్ ఏటీఎమ్‌లు వచ్చేస్తున్నాయ్

ఆధునిక ఫీచర్లతో రాబోతోన్న ఈ మల్టీ-ఫంక్షనల్ ఏటీఎమ్ మెచీన్లలో బయో-మెట్రిక్స్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండబోతున్నాయి. మెట్రో నగరాల్లో రీప్లేస్ చేసే పాత ఏటీఎమ్ మెచీన్లను టైర్ 2, టైర్ 3 నగరాలకు తరలించనున్నట్లు ఎన్‌సీఆర్ కార్పొరేషన్ తెలిపింది.

ఓమ్నీచానెల్ సొల్యూషన్స్ విభాగంలో గ్లోబర్ లీడర్‌గా కొనసాగుతోన్న ఎన్‌సీఆర్ కార్పొరేషన్ భారత్‌లో 50% ఏటీఎమ్ మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది. ఇంటరాక్టివ్ టెల్లర్ ఏటీఎమ్‌లతో పాటు ఈఎమ్‌వీ కాంటాక్ట్ లెస్ ఏటీఎమ్‌లను అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించిన ఈ మల్టీనేషనల్ కంపెనీ హైదరాబాద్‌లో ఓ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ది హిందూ పత్రిక పేర్కొంది.

ఎన్‌సీఆర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోన్న స్మార్ట్ ఏటీఎమ్ మెచీన్ల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ సదుపాయంతో పాటు క్యాష్ డిపాసిట్, చెక్స్ డిపాజిట్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయట. ఈ మెచీన్లలో డబ్బులు అయిపోతాయన్న బెడద కూడా ఉండదట. కస్టమర్స్ డిపాజిట్ చేసిన క్యాష్‌నే ఈ మెచీన్లు తిరిగి డిస్‌పెన్స్ చేయగలుగుతాయట.

మళ్లీ దుమ్మురేపిన జియో, భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

మన దేశంలో మొదటి సారిగా ఏటిఎంను ప్రారంభించింది హంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్. 1987లో ముంబాయిలో HSBC బ్యాంక్ ఎటీఎమ్ మెచీన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల కూడా ఏటిఎంలను ప్రారంభించాయి.

ఏటీఎమ్ మెచీన్లు అందుబాటులోకి రాకముందు గంటల తరబడి బ్యాంకుల్లో వేచి ఉండి డబ్బులు డ్రా చేసుకోవల్సిన పరిస్థితి. అది కూడా బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లోనే. బ్యాంకింగ్ అవర్స్ తరువాత ఎమర్జెన్సీగా డబ్బు అవసరమైతే తెలిసిన వారి వద్ద చేబదులు తీసుకోవడమో.. లేక అప్పు చేయక తప్పేది కాదు. కాని ఎటిఎంలు వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పడు కావాల్సి వస్తే అప్పుడు నగదు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Smart ATMs to replace the existing Indian ATM machines. The multi-function ATMs will have innovative features like face recognition and biometrics

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X