అమెజాన్ లో వీటి మీద RS.90,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఆరు రోజుల పాటు జరుగుతున్నందున ఈ సేల్స్ అక్టోబర్ 4 తో ముగుస్తుంది. ఈ సేల్స్ లో ఇది మూడో రోజు కావడంతో కొన్ని విభాగాలలోని ఉత్పత్తుల మీద విసృతంగా డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తున్నాయి. స్మార్ట్ ఉపకరణాలు మరియు ఎలక్ట్రానిక్స్‌పై కొన్ని ఆసక్తికరమైన ఆఫర్‌లు ఉన్నాయి. వీటిలో ఎల్‌జి మరియు శామ్‌సంగ్ నుండి టాప్-ఎండ్ స్మార్ట్-టివిలు, వాషింగ్ మెషీన్లు మరియు రిఫ్రిజిరేటర్లు మరియు IoT- ఆధారిత సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి.

అమెజాన్
 

మీలో ఎవరైనా వాషింగ్ మెషీన్లు మరియు రిఫ్రిజిరేటర్లు కొనాలి అని చూస్తూ ఉంటే దీని కంటే మంచి తరుణం రాదు. వాషింగ్ మెషీన్ల మీద ఎప్పుడు ఇవ్వనంత ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అమెజాన్ ఇప్పుడు ఇస్తోంది. డిస్కౌంట్ విషయంలో దాదాపు 10 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. రిఫ్రిజిరేటర్ల విషయంలో కూడా కనివిని ఎరుగని ఆఫర్లను అందిస్తోంది. వాటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

IFB 6.5 Kg వాషింగ్ మెషీన్

IFB 6.5 Kg వాషింగ్ మెషీన్

Wi-Fi అలెక్సా ద్వారా ప్రారంభించగల ఫుల్-ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ IFB 6.5 Kg వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.31,990 వద్ద లభిస్తుంది. దీని అసలు ధర రూ.36,990లు. అంటే దీని మీద రూ.5,000 వరకు డిస్కౌంట్ లభిస్తున్నది. దీనిని "మై IFB యాప్' ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.

షియోమి Mi బ్యాండ్ 4 ఫ్లాష్ సేల్స్.... ధర ఎంతో తెలుసా!!

LG 8 Kg వాషింగ్ మెషీన్

LG 8 Kg వాషింగ్ మెషీన్

ఎల్‌జీ 8 Kg ఇన్వర్టర్ వై-ఫై ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ప్రస్తుతం రూ.37,960లకు లభిస్తున్నది. దీని అసలు ధర రూ.50,990లు. అంటే దీని మీద సుమారు రూ.13,030 తగ్గింపు లభిస్తుంది. ఎల్‌జీకి చెందిన ఈ స్మార్ట్ వాషింగ్ మెషీన్‌ను స్మార్ట్‌టిన్ Q యాప్ ఉపయోగించి నియంత్రించవచ్చు. వాషింగ్ మెషీన్‌లోని లోపాలను గుర్తించడానికి కూడా యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.

అమెజాన్ ఫెస్టివల్ షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటించండి

వోల్టాస్ Wi-Fi ఇన్వర్టర్ స్ప్లిట్ AC
 

వోల్టాస్ Wi-Fi ఇన్వర్టర్ స్ప్లిట్ AC

1.4 టన్నుల బరువు ఉండి 3-స్టార్ గల వోల్టాస్ వై-ఫై ఇన్వర్టర్ స్ప్లిట్ AC ను ప్రస్తుతం రూ.32,999ల ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క అసలు ధర రూ.58,990లు. అంటే దీని మీద సుమారు రూ.25,991 తగ్గింపు లభిస్తుంది. వోల్టాస్ నుండి వచ్చిన స్మార్ట్ AC అలెక్సా సపోర్ట్‌తో పనిచేస్తుంది. కొనుగోలుదారులు అలెక్సాను ఉపయోగించి ACను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఉష్ణోగ్రతను మార్చడానికి, ఆన్ మరియు ఆఫ్ సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు.

ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 7T : ధర ఎంతో తెలుసా!!

శామ్‌సంగ్ 810 L రిఫ్రిజిరేటర్

శామ్‌సంగ్ 810 L రిఫ్రిజిరేటర్

శామ్‌సంగ్ 810 ఎల్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ను ఈ సేల్స్ లో భాగంగా రూ.2,59,900 లకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.3,50,000. అంటే దీని మీద సుమారు 90,010 రూపాయల తగ్గింపు అందిస్తోంది. శామ్సంగ్ నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ కుడి వైపున టచ్ లేదా వాయిస్ కమాండ్ ద్వారా పని చేసే సిస్టమ్ ఉంటుంది. దీని లోపల మూడు కెమెరాలు ఉన్నాయి. అవి ఫ్రిజ్ తెరవకుండానే లోపలి విషయాలను చూడటానికి ఉపయోగపడతాయి.

అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం PUBG మొబైల్ ప్రత్యేకమైన ఇన్-గేమ్ రివార్డులు

ఓరియంట్ సీలింగ్ ఫ్యాన్

ఓరియంట్ సీలింగ్ ఫ్యాన్

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్లిమ్ 1200 mm స్మార్ట్ ప్రీమియం సీలింగ్ ఫ్యాన్ ను ప్రస్తుతం రూ.7,699లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ .9,990. ఓరియంట్ ఎలక్ట్రిక్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫ్యాన్ ఇప్పుడు రూ.2,291 తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రివర్స్ రొటేషన్, టర్బో మోడ్, ఫ్యాన్ షెడ్యూలింగ్ వంటి ఫంక్షన్ల కోసం ఓరియంట్ స్మార్ట్ యాప్ ను ఉపయోగించి దీనిని నియంత్రించవచ్చు.

TV

షియోమి Mi LED TV 4C Pro 32-inch

షియోమి నుండి వచ్చిన 32 అంగుళాల Mi ఎల్‌ఇడి టివి 4 సి ప్రో హెచ్‌డి రెడీ ఆండ్రాయిడ్ టివిని ప్రస్తుతం రూ.10,999 లకే అందిస్తోంది. దీని అసలు ధర రూ .14,999లు. అంటే ఈ షియోమి Mi ఎల్ఇడి టివి రూ.4,000 తగ్గింపుతో లభిస్తోంది. ఇది 60 HZ రిఫ్రెష్ రేట్‌తో1366x768p ప్యాచ్‌వాల్‌ మరియు HD రెడీ డిస్ప్లేతో, ఆండ్రాయిడ్ os తో రన్ అవుతుంది.

LG 43-inch 4K UHD Smart LED TV

ఒరిజినల్ ధర : రూ. 54,990

ప్రస్తుత ధర : రూ. 36,999

డిస్కౌంట్ పొందిన ధర : రూ.17,991

Vu 43-inch Full HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV

ఒరిజినల్ ధర : రూ. 31,999

ప్రస్తుత ధర : రూ. 20,999

డిస్కౌంట్ పొందిన ధర : రూ.10,001

శామ్‌సంగ్ 43-inch సూపర్ 6 సిరీస్ స్మార్ట్ TV

ఒరిజినల్ ధర : రూ. 66,900

ప్రస్తుత ధర : రూ. 36,999

డిస్కౌంట్ పొందిన ధర : రూ.29,901

TCL 55-inch AI 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV

ఒరిజినల్ ధర : రూ. 74,990

ప్రస్తుత ధర : రూ. 31,999

డిస్కౌంట్ పొందిన ధర : రూ.42,991

Most Read Articles
Best Mobiles in India

English summary
Smart Fridges, Washing Machines, TVs get Discounts up to Rs 90,010 During Amazon Great Indian Festival

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X