జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

కమ్యూనికేషన్ విభాగంలో కొత్త సంస్కరణలకు నాంది పలుకుతూ అవతరించిన స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జ్ఞాపకశక్తిని హరించివేస్తున్నాయా..?, స్మార్ట్‌ఫోన్ మత్తులో జోగుతున్న మనిషి తన మెదడును ఆశ్రద్ధ చేస్తున్నాడా..?. అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టంబర్ - అక్టోబర్ 2012 మధ్య ఏసీ నిల్సన్ సంస్థ 46 ప్రముఖ పట్టణాల్లో నిర్వహించిన ఓ సర్వేలో 40 మిలియన్‌ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడైనట్లు తేలింది.

ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేసిన వారిలో సగం మంది 25 సంవత్సరాల లోపు వారేనట. స్మార్ట్‌ఫోన్ మనిషి జ్ఞాపకశక్తి పై ఏ విధమైన ప్రభావం చూపుతందనే అంశం పై నాలుగు వివరణలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

వాళ్ల ఆస్తులు అంతంతా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

1.) తెలియని మానసిక ఒత్తిడి:

అనేక ఫీచర్లను కలిగి ఉంటున్న స్మార్ట్‌ఫోన్‌లు మనిషిని తెలియన ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఉదాహరణకు.. ‘సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్' స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న యువతలో అత్యధిక శాతం మంది సోషల్ నెట్‌వర్కింగ్‌లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిద్రకు దూరమవుతున్నారు. ఆహారం వేళ కాని వేళల్లో తీసుకుంటున్నారు. పర్యావసానంగా అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

 

జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

2.) జ్ఞాపకశక్తి తగ్గుదల:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం జ్ఞాపకశక్తి పై ప్రభావం చూపుతోంది!. ఫోన్ నెంబర్‌లను మొదలుకుని వ్యక్తిగత విషయాల వరకు స్మార్ట్‌ఫోన్‌లలోనే స్టోర్ చేసుకుంటున్నాం. తద్వార మెదడుకు పనిలేకుండా పోతుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల వైపు చూడకుండా పది మంది మొబైల్ నెంబర్లు చెప్పగలిగితే గొప్పే.

 

జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

3.) చిన్నారుల పై ఈ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది:

స్మార్ట్‌ఫోన్‌లను చిన్నారులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నతనం నుంచే వారికి స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయటం ద్వారా ప్రాక్టికల్‌గా అవగాహన చేసుకోవల్సిన అంశాలను వారు ఆదమరుస్తారు.తద్వారా వారు మానసికంగా వెనుకబడిపోయే అవకాశముంది.

 

జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

4.) మెదడు సోమరితనంగా మారే అవకాశం:

స్మార్ట్‌ఫోన్‌లు మానవ మేధస్సును సోమరిగా మార్చేసే అవకాశాం లేకపోలేదు. సార్ట్‌ఫోన్ అన్ని సౌకర్యాలను చేరువ చేసేస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌‍ఫోన్ ద్వారా టన్నుల కొద్ది సమచారాన్ని ఏ మాత్రం శ్రమించుకుండా తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఓ మెదడుందన్న విషయాన్ని ఆదమరుస్తున్న పలువురు తమకు తెలిసిన విషయాలను తెలుసుకునేందుకు సైతం సెర్చ్ ఇంజన్‌లను ఆశ్రయిస్తున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot