పక్కలో కూడా అదే యావ!

Posted By:

చాలా మంది భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లను చేతిలో పెట్టుకునే నిద్రపోతున్నరాట. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పై మోటరోలా సంస్థ విడుదల చేసిన ఓ సర్వేలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. కొందరైతే తమ కుటుంబ సభ్యలు పక్కనే ఉన్నప్పటికి ఫోన్‌ ధ్యాసలోనే మునిగితెలుగుతున్నారట. ఇప్పటికే ఇంతలా విస్తరించిన ఈ స్మార్ట్‌ఫోన్ జాఢ్యం రానున్న రోజుల్లో ఏ పరిస్థితులకు దారీ తీస్తోందో చూడాలి?. ఈ సర్వేలో బట్టబయిలైన మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: హవ్వా! అతని దగ్గర లేదంట..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సర్వేను మొత్తం 7 దేశాల్లో నిర్వహించారు. 

దేశాల వివరాలు: అమెరికా, బ్రిటన్, బ్రెజిట్, చైనా, స్పెయిన్, మెక్సికో, ఇండియా

ఈ సర్వేలో భాగంగా కేఆర్‌సీ రిసెర్చ్ సంస్థ మొత్తం ఏడు దేశాల్లో 7,112 మంది స్మార్ట్‌ఫోన్ యజమానుల పై ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది.  

 

భారతదేశంలో 74శాతం మంది మంచం పై స్మార్ట్‌పోన్ లేనిదే నిద్రపోవటం లేదని ఈ సర్వే చెబుతోంది.

చైనాలో 70 శాతం మంది ఇదే జాఢ్యంతో సతమతమవుతున్నారని సర్వే చెప్పింది.

ప్రతి ఆరుగురిలో ఒకరు స్నానం చేసే సమయంలో కూడా స్మార్ట్‌పోన్‌ను వదిలి పెట్టడం లేదట.

కొందరైతే తమ కుటుంబ సభ్యలు పక్కనే ఉన్నప్పటికి ఫోన్‌ ధ్యాసలోనే మునిగితెలుగుతున్నారట. వీళ్లు స్మార్ట్ ఫోన్ ధ్యాసలో మునిగిపోయి. ఏ అర్థరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారట.

ఈ సర్వేలో 40 శాతం మంది తమ బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా చెప్పుకోలేని రహస్యాలను ఫోన్‌లలో భద్రపరిచి ఉంచారట.

ఈ సర్వేలో భాగంగా 39శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లతో తామెంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారట.

79శాతం మంది మాత్రం తమ స్మార్ట్‌ఫోన్‌ల పై అసంతృప్తి వ్యక్తం చేసారట.

ఈ సర్వేను కేఆర్‌సీ రిసెర్చ్ సంస్థ నిర్వహించగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా విడుదల చేసింది. చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో ఇటీవల మోటరోలాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones Become Indians New Sleeping Partner. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot