స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా ఫేలవమైన కంటి చూపు!

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా ఫేలవమైన కంటి చూపు!

మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం చిన్నారులు ఇంకా మయస్కులైన యువకుల కంటి చూపు పై ప్రభావం చూపుతోందిన తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ అంశం పై ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోకస్ క్లినిక్స్ వ్యవస్థాపకులైన డేవిడ్ అలాంబై మాట్లాడుతు రాబోయే దశాబ్దంలో పిల్లలు ఇంకా వయస్కులైన యువకుల్లో హ్రస్వ దృష్టి (myopia) 50 శాతానికి పెరిగే అవకాశముందని వెల్లడించారు. బ్రిటన్‌లో 50 శాతానికి పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. వీరు సగటున రోజుకు 2గంటల పాటు స్మార్ట్‌ఫోన్ ముందు గడుపుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్‌లను తమ ముఖాలకు మరింత దగ్గరగా అంటే కేవలం 18 నుంచి 30 సెంటీమీటర్ల వ్యత్యాసంలో ఉంచుతున్నారని వెల్లడైంది.

అదృశ్య మనిషి!

చైనాలోని షాండోంగ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారుడు లియూ బోలిన్ తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. 1973లో జన్మించిన ఈ కళాచతురుడు ఫైన్‌ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి 1995లో బ్యాచిలర్ డిగ్రీని, 2001లో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఇతని కళలోని సృజనాత్మకత ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. అదృశ్య మనిషిగా గుర్తింపుతెచ్చుకుని బోలిన్ ‘హైడింగ్ ఇన్ ద సిటీ' సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లోని పలు ఆర్ట్ వర్క్‌లు బోలిన్ కళాత్మకతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఈ ఆర్డ్ వర్క్‌లలో భాగంగా ప్రకృతిలో బోలిన్ మమేకమైన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపచేస్తుంది. జీవం ఉట్టిపడే కళ కోసం బోలిన్ పరితపిస్తాడనటానికి ఈ ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting