స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
ఇప్పుడు ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హోరాహోరీగా పోరాడుతున్న పోటీ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో స్నాప్ కార్ట్ విలీనమబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కామర్స్ రంగం నుంచి వస్తున్న కథనాల ప్రకారం పై రెండు సంస్థల్లో ఏదో ఒకదానిలో విలీనమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఉన్న నిజమెంతో అనేది తెలియడం లేదు.
ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
స్నాప్‌డీల్ పోటీ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో విలీనమయ్యే ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ ఇటీవలే దీనిపై సమావేశం కూడా అయినట్లు తెలిపాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
అయితే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఈ వార్తలను తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని పేర్కొన్నాయి. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ఇవి నమ్మొద్దని చెబుతున్నాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
భారత ఈకామర్స్ రంగంలో దేశీయంగా ఎదిగిన కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. స్నాప్‌డీల్ ఇప్పటిదాకా ఇరవై పైగా ఇన్వెస్టర్ల నుంచి సుమారు 1.65 బిలియన్ డాలర్లను సమీకరించింది.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
కొన్నాళ్ల క్రితం కెనడాకి చెందిన ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ తదితర సంస్థల నుంచి స్నాప్‌డీల్ 200 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు.. దాని వాల్యుయేషన్‌ను దాదాపు 6.5 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. అప్పట్లో ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లలో ఇది సగానికన్నా తక్కువ.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటిలో జపాన్‌కి చెందిన టెలికం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, చైనా ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా, ఫాక్స్‌కాన్, ఈబే, ఇంటెల్ క్యాపిటల్, ఐరన్ పిల్లర్, కలారీ క్యాపిటల్ వంటి వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లతో పాటు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కూడా ఉన్నారు.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
2014లో దాదాపు 627 మిలియన్ డాలర్లు, గతేడాది మరో 500 మిలియన్ డాలర్లను కంపెనీకి సమకూర్చడంలోసాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్ అరోరా కీలక పాత్ర పోషించారు. అయితే వివిధ కారణాల రీత్యా అరోరా అకస్మాత్తుగా జూన్‌లో రాజీనామా చేయడంతో సాఫ్ట్‌బ్యాంక్ భారత ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
ప్రస్తుతానికి అదనంగా మరిన్ని నిధులు సమీకరించాల్సిన అవసరం లేకుండా సుమారు ఏడాదికి సరిపడా నగదు నిల్వలు స్నాప్‌డీల్ వద్ద్ ఉన్నాయని అంచనా.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్ నుంచి కంపెనీకి భవిష్యత్‌లో అందే సహాయ సహకారాలపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో స్నాప్‌డీల్ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
ఫ్లిప్‌కార్ట్ కూడా అమెజాన్‌లో విలీనం కోసం గతేడాది ఆఖరు నాటి దాకా చర్చలు జరిపిందంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి నిరాధారమైనవిగా తేలాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
ఒకవైపు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే .. పుష్కలంగా నిధులు ఉన్న పోటీ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. భారత కార్యకలాపాలపై ఏకంగా 3 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
లాభాల ఊసు పక్కన పెట్టి.. కస్టమర్లను ఆక ర్షించడానికి భారీ డిస్కౌంట్లు, మార్కెటింగ్‌కు కోట్ల కొద్దీ నిధులు కుమ్మరించిన దేశీ ఈకామర్స్ దిగ్గజాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పోటీ సంస్థల వైపు చూస్తున్నాయి.

స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం..సోషల్ మీడియాలో హల్‌చల్
మరి ముందు ముందు దేశీ ఈకామర్స్ దిగ్గజాలు నష్టాల ఊబి నుంచి గట్టెక్కుతాయా లేక చతికిలపడతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు వేచి చూడకతప్పదు.

Click it and Unblock the Notifications