నోకియా గురించి ‘ఆసక్తికర నిజాలు ’

|

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తున్న ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి నోకియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆధునిక వర్షన్ విండోస్ ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించింది. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించుకుందాం....

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఫిన్‌లాండ్ ముఖ్య కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న నోకియాకు ప్రపంచదేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నోకియా ఫ్యాక్టరీ కోట్లాది మొబైల్ ఫోన్‌లను తయారు చేసి ఆసియాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన నోకియా మొబైల్ తయారీ ప్లాంట్, చైనాలో ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్‌లతో పోలిస్తే పెద్దదిగా ఉండటం మనకు గర్వం కారణం. మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

లూమియా అనే పదం ఏలా వచ్చింది..?

లూమియా అనే పదం ఏలా వచ్చింది..?

నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

పేపర్ మిల్‌తో మొదలై..

పేపర్ మిల్‌తో మొదలై..

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది.

అనేక ఉత్పత్తుల...

అనేక ఉత్పత్తుల...

మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

తొలి మొబైల్‌ఫోన్ నెట్‌వర్క్

తొలి మొబైల్‌ఫోన్ నెట్‌వర్క్

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X