మీ ఫోన్ క్షణాల్లో ఛార్జింగ్ కావాలా..అయితే ఇది మీ కోసమే

Written By:

స్మార్ట్‌ఫోన్ వినియోగించేవారు బయటకి వెళ్లాలంటే ముందుగా చూసేది పవర్ బ్యాంక్ వైపు..ఎందుకంటే డేటాను వాడితే ఫోన్ బ్యాటరీ క్షణాల్లో తరిగిపోతుంది. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎంతో టైం తీసుకుంటుంది. దగ్గర్లో ఛార్జింగ్ సదుపాయం లేకుంటే అంతే సంగతులు..ఇప్పుడు ఆ సమస్యలకు రాంరాం చెబుతూ సోని ఓ కొత్త పవర్ బ్యాంక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పవర్ బ్యాంక్ తో మీ ఫోన్ క్షణాల్లో ఛార్జ్ అవుతుంది.

షాక్: జియో సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తారట..ఎందుకో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోని సీపీ-ఎస్సీ 10

దిగ్గజ సంస్థ సోని సీపీ-ఎస్సీ 10 (CP-SC10) 'అనే పేరిట 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ కలిగిన ఓ కొత్త పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది.

చార్జింగ్

దీంతో 2000 ఎంఏహెచ్ కలిగిన ఫోన్లను 5 సార్లు, 2500 ఎంఏహెచ్ పవర్ కలిగిన డివైస్‌లను 4 సార్లు, 3000 ఎంఏహెచ్ పవర్ కలిగిన ఫోన్లను 3 సార్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ

ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ, బ్యాటరీ అడాప్టర్ పవర్ 3 ఆంప్స్ ఉండడం వల్ల ఈ పవర్ బ్యాంకుతో మీ ఫోన్లు క్షణాల్లోనే ఛార్జింగ్ అవుతాయి.

కొత్త తరహా యూఎస్బీ టైప్-సి

అదీగాక ఈ పవర్ బ్యాంక్‌కు కొత్త తరహా యూఎస్బీ టైప్-సి అడాప్టర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏ స్మార్ట్‌ఫోన్‌కయినా  అలాగే ల్యాప్ టాప్ కు పవర్ బ్యాంక్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

పవర్ బ్యాంక్‌పైన 4 ఎల్ఈడీ లైట్ ఇండికేటర్లను

దీంతో పాటు పవర్ బ్యాంక్‌పైన 4 ఎల్ఈడీ లైట్ ఇండికేటర్లను ఇచ్చారు. దీంతో పవర్ బ్యాంక్లో ఇంకా ఎంత చార్జింగ్ మిగిలి ఉందో, చార్జింగ్ ఎంత సేపట్లో పూర్తవుతుందో మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

పవర్ బ్యాంక్ బ్యాటరీ కెపాసిటీ

1000 సార్లు చార్జింగ్ చేసినా ఈ పవర్ బ్యాంక్ బ్యాటరీ కెపాసిటీ ఏ మాత్రం తగ్గదని, దీని వల్ల 90 శాతం బ్యాటరీ సామర్థ్యం అలాగే ఉంటుందని సోనీ ప్రతినిధులు చెబుతున్నారు.

పవర్ బ్యాంక్ ధర

సోనీ విడుదల చేసిన సీపీ-ఎస్సీ 10 (CP-SC10) పవర్ బ్యాంక్ రూ .5,990 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది.

యూఎస్బీ టైప్-సి కేబుల్‌

దీనికి సపోర్ట్‌గా ఉండేందుకు గాను యూఎస్బీ టైప్-సి కేబుల్‌ను కొనాలనుకుంటే మరో రూ .2,390 లను అదనంగా చెల్లించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Launches 10,000 mAh Power Bank and USB Type-C AC Adapter in India Read more gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot