షాక్: జియో సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తారట..ఎందుకో తెలుసా..?

Written By:

జియో ఇప్పుడు దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. మరి అంతగా దేశాన్ని కుదిపేస్తున్న జియోకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌తో కష్టాలు మొదలయ్యాయి. జియో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని దానికి అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ని పెట్టారు. అయితే ఇప్పుడు షారూఖ్ ఖాన్ పై అలాగే జియోపై నెటిజన్లు విమర్శలను గుప్పిస్తున్నారు.

2జిబి డేటాను జియో 4G అన్‌లిమిటెడ్ కింద మార్చుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాక్ మీద షాక్

జియోకి షాక్ మీద షాక్ తగులుతోంది. రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ‘బాద్షా' షారూఖ్ ఖాన్‌పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయనను వెంటనే తప్పించాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు.

సర్వీస్‌ను బాయ్‌కాట్

లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ బెదిరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జియో సిమ్‌ల కోసం ఎగబడిన వారంతా నేడు ఆ సర్వీస్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

దేశభక్తి ఏమాత్రం లేదని

షారూఖ్‌లో దేశభక్తి ఏమాత్రం లేదని, అటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన వంచకుడని, జాతి వ్యతిరేకి అని ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించి ఆ స్థానంలో

షారూఖ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించి ఆ స్థానంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారికి అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

#JioRemoveSRK

#JioRemoveSRK పేరుతో సోషల్ మీడియాలో షారూఖ్ ఖాన్ కి వ్యతిరేకంగా నెటిజన్లు గళం విప్పుతున్నారు. ట్విట్టర్లో అయితే ఇది వైరల్ గా మారుతోంది.

రెండు ఆప్సన్లతో ఓటింగ్

ఈ పోస్ట్ ను మహేష్ విక్రమ్ హెగ్డే అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు జియోకి షారూఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా కావాలా వద్దా అనే రెండు ఆప్సన్లతో ఓటింగ్ కూడా ఇచ్చారు. 

నెటిజన్ల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి

‘ఉచిత' ఆఫర్‌తో టెలికం గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్‌ ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న షారూఖ్‌కు కూడా ఇది షాకింగ్ లాంటి వార్తే.

ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు

అయితే నెటిజన్ల విమర్శలు, పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంపై అటు రిలయన్స్ నుంచి కానీ, ఇటు షారూఖ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

రోజు రోజుకు వివాదం ముదురుతున్న నేపథ్యంలో

ట్విట్టర్లో రోజు రోజుకు వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. రిలయన్స్, షారూఖ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Twitter erupts over Shah Rukh Khan as Reliance Jio brand ambassador read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting