అవతార్ ఫీచర్లతో కొత్త సోనీ వాక్‌మ్యాన్
1980 మరియు 1990 లలో వాక్మన్ అంటే అందరికి చాలా ఇష్టమైన ఒక మ్యూజిక్ ప్లేయర్. అందులో కూడా సోనీ యొక్క వాక్మన్ ఎంత ప్రజాదరణ పొందినదో ప్రతి ఒక్కరికి తెలిసింది. సోనీ వాక్మన్ ఒక ఐకానిక్ ప్రోడక్ట్. ఇటీవల జూలై నాటికి సోనీ వాక్మన్ తయారుచేసి 40 ఏళ్ళకు చేరుకుంది. గతంలో దీనిని ఉపయోగించిన వారికి వాక్‌మ్యాన్ క్యాసెట్ ప్లేయర్ ఎంత మంచిదో తెలుసు.

కొన్ని సంవత్సరాలుగా సోనీ వాక్మన్ పోర్టబుల్ సిడి ప్లేయర్, డిస్ప్లేతో కూడిన డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ మరియు మరెన్నో వివిధ రూపాలలో తయారుచేయబడింది. ఇప్పుడు ఆధునిక హంగులు మరియు అవతార్‌లలో కొత్త సోనీ వాక్‌మ్యాన్ త్వరలో ప్రారంభించవచ్చని కొత్త నివేదిక సూచించింది.

ఫీచర్స్:
వాక్‌మన్ యొక్క బ్లాగులోని ఒక నివేదిక ప్రకారం మోడల్ నంబర్ NW-A100 తో వచ్చే ఈ కొత్త డివైస్ ఇటీవల ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్‌సైట్‌లో విడుదల చేసారు. ఈ నివేదికలో రాబోయే డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ గురించి పరిమిత సమాచారం మాత్రమే జాబితా చేయబడింది. రాబోయే సోనీ వాక్‌మన్ వై-ఫై కనెక్టివిటీ (2.4 / 5.0GHz) తో రాబోతోంది అని FCC లిస్టింగ్ పేర్కొంది.

కనెక్టివిటీ :
వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల ద్వారా మ్యూజిక్ వినడానికి బ్లూటూత్ యొక్క 5.0 వంటి కనెక్టివిటీ ఎంపికలు కూడా ఇందులో ఉంటాయి. హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర వైర్‌లెస్ పరికరాలతో కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే NFC కనెక్టివిటీ ఎంపిక కూడా ఉంటుంది. సోనీ సంస్థ వాక్‌మన్ యొక్క ఇమేజ్ షేర్ చేయలేదు కాబట్టి ఫారమ్ ఫ్యాక్టర్ లేదా డిజైన్ గురించి ఎటువంటి సమాచారం లేదు.

స్పెసిఫికేషన్స్:
సోనీ వాక్మన్ యొక్క పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ ఇది Wi-Fi కనెక్టివిటీని కలిగి ఉండటం వలన దీని ద్వారా మీరు Qobuz, Tidal, Spotify మరియు మరిన్ని సేవల నుండి సంగీతాన్ని ప్రసారం చేయగలరని అర్థం. సోనీ వాక్‌మ్యాన్ ప్లేబ్యాక్ DSD, WAV మరియు FLAC ఫైల్‌లకు కూడా మద్దతు ఇవ్వగలదు.

పోటీ మరియు ప్రారంభ తేదీ:
సోనీ కొత్త వాక్‌మ్యాన్‌ను బెర్లిన్‌లో IFA 2019 లో ఆవిష్కరించగలదు అని సమాచారం. వినియోగదారు టెక్ షో సెప్టెంబర్ 6 మరియు సెప్టెంబర్ 11 మధ్య జరుగుతుంది. దీనికి గల పోటీ గురించి మాట్లాడవలసి వస్తే ఆపిల్ iPod టచ్ (2019) దీనికి ముఖ్యమైన ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. ఇది 4-అంగుళాల టచ్ డిస్ప్లే, ఫ్రంట్ మరియు రియర్ కెమెరా మరియు 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. కొత్త iPod టచ్ ప్రారంభ ధర 18,900 రూపాయలు. సోనీ కొత్త వాక్‌మ్యాన్‌కు పోటీగా FiiO M7 హై-రెస్ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది. దీనిని మీరు సుమారు 17,000 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సోనీ ఈ రెండు అందించే పోటీ నుండి ఎలా వేరు చేయగలదో చూడాలి.


Click it and Unblock the Notifications








