సోనీ ఆండ్రాయిడ్ 4.0.4 అప్‌డేట్!

Posted By: Prashanth

సోనీ ఆండ్రాయిడ్ 4.0.4 అప్‌డేట్!

 

ఎక్స్‌పీరియా సిరీస్‌లోని పలు స్మార్ట్‌ఫోన్‌లకు సోనీ ఆండ్రాయిడ్ 4.0.4 అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్ ద్వారా ఎక్ప్‌పీరియా పీ, ఎక్ప్‌పీరియా యూ, ఎక్ప్‌పీరియా సోలా, ఎక్ప్‌పీరియా గో యూజర్లు పోర్టబుల్ హాట్‌స్పాట్ , ఎన్‌ఎఫ్‌సీ వంటి అత్యాధునిక మొబైలింగ్ ఫీచర్లను పొందవచ్చు. సోనీ ఐసీఎస్ అప్‌డేట్‌ను గత అగష్టునుంచే ప్రారంభించింది. తొలిగా ఈ అప్‌గ్రేడ్‌ను ఎక్ప్‌పీరియా పీ స్మార్ట్‌ఫోన్‌లు పొందాయి. తరువాతి క్రమంలో ఎక్ప్‌పీరియా యూ, ఎక్ప్‌పీరియా సోలా, ఎక్ప్‌పీరియా జీ ఫోన్‌లకు ఐసీఎస్ అప్‌డేట్ వర్తించింది. ఆండ్రాయిడ్ 4.0.4 అప్‌డేట్‌ వర్తించే సదరు యూజర్లు ఓవర్ ద ఎయిర్ (వోటీఏ) ద్వారా లేదా విండోస్ పీసీ ద్వారా పొందవచ్చు. తాజాగా సోనీ తన ఎక్ప్‌పీరియా సిరీస్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్ -7)

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ ఫోన్స్ (నీటిలో తడవకుండా)

సోనీ ఎక్ప్‌పీరియా ఎస్ (Sony Xperia S):

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

12.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

1జీబి ర్యామ్,

వై-ఫై, బ్లూటూత్, 3జీ,

మైక్రోయూఎస్బీ 2.0,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

1750ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర రూ.25,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot