జియోకి దడ : అన్ని నెట్‌వర్క్‌లకు లైఫ్ టైం ఫ్రీ

Written By:

టెలికం రంగంలో పోటీకి తెరలేపిన జియోతో ఇప్పుడు టారిఫ్ ల యుద్దం కొనసాగుతోంది. అన్ని కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ కష్టమర్లను ఆఫర్ల మత్తులో ముంచేస్తున్నాయి. ఈ నేఫధ్యంలో జియోతో ఏ టెల్కో కంపెనీ కూడా గట్టి పోటినివ్వడం లేదు.అయితే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పుడు నువ్వూ నేనా అంటూ లైఫ్ టైం ఫ్రీవాయిస్ కాల్స్‌తో దూసుకొస్తోంది.

వాట్సప్ నుంచి బయటకొస్తే..అదిరే ఛాటింగ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టారిఫ్ ల ఆఫర్ల జోరు

టెలీకాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీ సంచలనంతో మొదలైన టారిఫ్ ల ఆఫర్ల జోరు ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికాం దిగ్గజం బిఎస్‌ఎన్‌ఎల్ జియో తో బలమైన పోటీకి సిద్దమవుతోంది.

అన్ని నెటవర్క్ లకు , లైఫ్ టైం ఫ్రీ వాయిస్ ప్లాన్‌

తమ మొబైల్ యూజర్లకు జనవరి, 2017 నుంచి, అన్ని నెటవర్క్ లకు , లైఫ్ టైం ఫ్రీ వాయిస్ ప్లాన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు జీవిత కాలం మొత్తం ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

బ్రాండ్‌బాండ్ కనెక్షన్ ఉన్న మొబైల్ యూజర్లకు

అయితే బిఎస్‌ఎన్ఎల్ బ్రాండ్‌బాండ్ కనెక్షన్ ఉన్న మొబైల్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తించనుంది కంపెనీ స్పష్టం చేసింది. మిగతా వారికి ఈ ఆఫర్ వర్తించదని కంపెనీ తెలిపింది.

బిఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ

ఈ మేరకు బిఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఛైర్మన్ 'జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్' విశేషాలపై త్వరలోనే ఒక ప్రకటన చేయనున్నారని సంస్థ వెల్లడించింది.

2జీ, 3జీ, 4జీ లో అన్ని నెట్ వర్క్ లకు

రూ.149 ఎంట్రీ ప్రైస్ పాయింట్లో రిలయన్స్ జియో 4జీ వినియోగదారులకు మాత్రమే ఉచిత సేవలందిస్తోందని తాము మాత్రం 2జీ, 3జీ, 4జీ లో అన్ని నెట్ వర్క్ లకు జీవిత కాలం ఉచిత వాయిస్ కాల్ సర్వీసులను అందించనున్నట్టు తెలిపింది.

కొన్ని రాష్ట్రాల్లో మంచి మార్కెట్

కాగా బీఎస్ఎన్ఎల్ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, హర్యానా ఒడిశా, పంజాబ్ లలో మంచి మార్కెట్ ను కలిగి ఉంది.

కస్టమర్లను నిలుపుకునేందుకు

రిలయన్స్ జియో ఎంట్రీతో మార్కెట్లో తమ కస్టమర్లను నిలుపుకునేందుకు బిఎస్‌ఎన్‌ఎల్ వివిధ ఆఫర్లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

2 రూపాయలతో నెలంతా ఫ్రీ కాల్స్

2 రూపాయలతో నెలంతా ఫ్రీ కాల్స్..జియోకి దడ పుట్టిస్తున్న బిఎస్ఎన్ఎల్..మరింత సమాచారం కోసం చదవండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Soon, BSNL to offer lifetime free voice plan for all networks read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot