మెసేంజర్‌లోకి సరికొత్త ఫీచర్

Written By:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మెసేంజర్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేటపుడు ఉండే ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఫేస్‌బుక్ మెసెంజర్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ ఫీచర్ వాట్సప్‌లో మాత్రమే ఉంది.

జియో స్పీడ్‌ని 40ఎంబిపిఎస్‌కు పెంచుకోవడం ఎలా..?

మెసేంజర్‌లోకి సరికొత్త ఫీచర్

'సీక్రెట్ కన్వర్సేషన్స్' అనే ఫీచర్‌ను టాగిల్ కీ లా ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్సప్‌లో అయితే మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా కూడా ఎన్‌క్రిప్షన్ ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కానీ మెసెంజర్‌లో మాత్రం మనం కావాలనుకున్న వాటికి మాత్రమే అది ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లోనూ ఓలా క్యాబ్ బుకింగ్

మెసేంజర్‌లోకి సరికొత్త ఫీచర్

అయితే.. ఇక్కడో మెలిక కూడా ఉంది. ఒకసారి మనం ఆటోమేటిక్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకుంటే.. మెసెంజర్‌లో ఉన్న దాదాపు వంద కోట్ల మంది యూజర్లు కూడా ప్రతి మెసేజికి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ సమస్య ఉండబోదని, కొత్త మెసేజి స్క్రీన్ మీద కుడిచేతి వైపు పైన 'సీక్రెట్' అనే కీ కనపడుతుందని, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్ వర్గాలు అంటున్నాయి. అయితే సందేశాలు పంపేవాళ్లు, అందుకునేవాళ్లు కూడా కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మెసేంజర్‌లో ఇవి కూడా చేయవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 సెకండ్ల వీడియో

దీనిలో ఒక్క మెసేజ్ లు మాత్రమే కాకుండా 15 సెకండ్ల వీడియో కూడా పంపుకోవచ్చు.ఇందుకోసం మీరు కెమెరా బటన్ ని ట్యాప్ చేసి షట్టర్ బటన్ నొక్కితే వీడియో రికార్డవుతుంది.

బోట్స్

ఈ ఫీచర్ ని కొత్తగా ప్రవేశపెట్టింది.త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వెదర్ రిపోర్ట్ ,హెల్త్ రిపోర్ట్ తెలుసుకోవచ్చు.

 

 

చెస్ గేమ్

మీకు బోర్ కొడుతున్నప్పుడు మీరు చెస్ గేమ్ కూడా ఇందులో ఆడుకోవచ్చు.దీనికోసం మీరు '@fbchess' అనిటైప్ చేస్తే చాలు. అది మీరు వెళ్లాలనుకుంటే తప్ప ముగింపుకు రాదు.

హిడెన్ బాస్కెట్ బాల్ గేమ్

హిడెన్ బాస్కెట్ బాల్ గేమ్ కూడా ఇందులో ఉంది. మీరు బాస్కెట్ బాల్ ఎమోజి సెండ్ చేయగానే గేమ్ స్టార్టవుతుంది. మీరు స్కీన్ టాప్ చేయడం ద్వారా గేమ్ ఆడుకోవచ్చు.

Soccer game!

యూరో కప్ 2016 సమయంలో ఈ గేమ్ ని డెవలప్ చేశారు. ఇది కూడా మీరు బాస్కెట్ బాల్ టైప్ లోనే Soccer బాల్ ఎమోజిని పంపి స్టార్ట్ చేసుకోవచ్చు.

గ్రూప్ కన్వర్షన్ పిన్

ఈ ఫీచర్ చాట్ అప్లికేషన్స్ లో లభ్యం కావడం లేదు. అయితే మెసేంజర్ లో ఈ ఆప్సన్ ఉంది. మీరు గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ సెక్షన్ ని మూడు డాట్స్ బటన్స్ నొక్కడం ద్వారా పిన్ చేసుకోవచ్చు.

 

 

క్యాబ్ బుక్

మీరు ఈ ఫీచర్ ని కూడా ఉపయోగించుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Encrypt your chats on Facebook Messenger now read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot