ప్రమాదంలో చిక్కుకున్నారా : అయితే 9 గట్టిగా నొక్కండి

Written By:

మీరు ప్రమాదంలో చిక్కుకున్నారా దగ్గరలో మీకు సహాయం చేసేవారు ఎవరూ లేరా..మీ ఆర్తనాదాలు ఎవరికీ వినపడటం లేదా.. అయితే ఇప్పుడు మీకు ఎటువంటి భయం అవసరం లేదు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మీకు తక్షణమే సహాయం అందుతుంది. దానిలోని 9 నంబర్ ను గట్టిగా పట్టుకుంటే అది నేరుగా పోలీసులకే చేరుతుంది.. అద్భుతమైన ఈ పీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Read more : రాహుల్ యూరప్ ట్వీట్లపై నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎవరైనా ఏదైనా ప్రమాదంలో పడితే తక్షణ సాయం కోసం

ఎవరైనా ఏదైనా ప్రమాదంలో పడితే తక్షణ సాయం కోసం సమాచారం క్షణాలపై వెళ్లేలా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మరో టెక్నాలజీ ఆధారిత సేవ మార్చి నుంచి అందుబాటులోకి రానుంది. మీ మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ లో ఉన్న 9 నంబర్ పై లాంగ్ ప్రెస్ చేస్తే చాలు.

సమీపంలోని పోలీసు స్టేషన్ కు

సమీపంలోని పోలీసు స్టేషన్ కు ,పెట్రోలింగ్ పోలీసులకు బంధుమిత్రులకు సమాచారం వెళ్లిపోతుంది.

ఆపై మీఫోన్ ట్రాకింగ్ మొదలై

ఆపై మీఫోన్ ట్రాకింగ్ మొదలై మీరెక్కడున్నారన్న సమాచారం పోలీసులకు అందుతుంది. ఆపై సాధ్యమైనంత త్వరలో మీకు సహాయం అందుతుంది.

గత కొంతకాలంగా ఈ సదుపాయం కల్పించేందుకు

గత కొంతకాలంగా ఈ సదుపాయం కల్పించేందుకు ఐటీ శాఖ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. దీంతో వచ్చే మార్చి నుండి ఈ సదుపాయం అమల్లోకి రానుంది.

వాస్తవానికి ఈ ఆలోచన మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి

వాస్తవానికి ఈ ఆలోచన మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ మనసులో నుంచి వచ్చింది. దీనికి ప్రధాని సైతం సానుకూలంగా స్పందించడంతో పలువురు ఐటీ నిపుణులు రంగంలోకి దిగి 9 ఫెసిలిటీని సాకారం చేశారు.

కాగా ఇకపై మార్కెట్లోకి వచ్చే హ్యాండ్ సెట్లలో

కాగా ఇకపై మార్కెట్లోకి వచ్చే హ్యాండ్ సెట్లలో వాల్యూమ్ బటన్లను కలిపి ప్రెస్ చేసినా అది ఓ ట్రిగ్గర్ గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే

ఈ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే టెలికం కంపెనీలు సైతం తమ సాంకేతికతను కొంత అప్ గ్రేడ్ చేసుకోవాల్సి వుండటంతోనే 9 సౌకర్యం కొంత ఆలస్యమవుతోందని సమాచారం.

మీరు దీనికోసం ఎక్స్ ట్రాగా ఫిజికల్ బటన్ స్టేల్ మేట్

మీరు దీనికోసం ఎక్స్ ట్రాగా ఫిజికల్ బటన్ స్టేల్ మేట్ అనే యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవలిసి ఉంటుంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.

అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యం అయ్యేదేనా

అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యం అయ్యేదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Starting March, just dial 9 when in distress
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot