అబ్బాయిల చాకిరీని స్మార్ట్‌గా పట్టుకెళ్తున్న అమ్మాయిలు

Written By:

సాఫ్ట్‌వేర్ రంగంలో జీతాలు ఎవరికి ఎక్కువో తెలుసా? నిజానికి ఈ రంగం ఆధిపత్యం చెలాయిస్తున్నదెవరో తెలుసా? ఐటీ రంగంలో ఆధిపత్యం అబ్బాయిలదే అయినా అత్యధికంగా జీతాలు పొందుతున్నది మాత్రం అమ్మాయిలే! అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలే ఎక్కువ ప్రారంభం వేతనం తీసుకుంటున్నట్లు ఒక సర్వే నివేదిక తేల్చి చెప్పింది. ఏమిటి షాక్ అవుతున్నారా..ఇది నిజం అబ్బాయిలు పనిచేయడం వరకే సరిపెడితే అమ్మాయిలు స్మార్ట్ గా అత్యధిక జీతాలతో దూసుకుపోతున్నారట. రీసెంట్ గా ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరి ఏ నగరంలో వారు ఎక్కువ అందుకుంటున్నారో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మళ్లీ శ్యాంసంగ్‌కే పట్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అబ్బాయిలు ఏడాదికి సగటున 9.5 లక్షల రూపాయలు

మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మూడేళ్ళ లోపు అనుభవం ఉన్న సాఫ్ట్-వేర్ ఇంజనీర్ల జీతాలను పరిశీలిస్తే.. అబ్బాయిలు ఏడాదికి సగటున 9.5 లక్షల రూపాయలు అందుకుంటున్నారు.

అమ్మాయిలైతే 9.8 లక్షల రూపాయలు

అదే సమయంలో అమ్మాయిలైతే 9.8 లక్షల రూపాయలు పొందుతున్నారు.

హైదరాబాద్-లో అబ్బాయిలు రూ. 9.4 లక్షలు

ఇక హైదరాబాద్-లో అబ్బాయిలు రూ. 9.4 లక్షలు ఏడాదికి వేతనంగా పొందుతున్నారు.

అమ్మాయిలైతే అంత కంటే ఎక్కువగా 9.7 లక్షలు

ఇక అమ్మాయిలైతే అంత కంటే ఎక్కువగా 9.7 లక్షల చొప్పున సరాసరిన తీసుకుంటున్నారు.

అనుభవం పెరిగే కొద్దీ అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ వేతనాలు

కాగా.. అనుభవం పెరిగే కొద్దీ అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది.

నాలుగేళ్ళ అనుభవం సంపాదించిన తర్వాతే...

ఐటీ రంగంలో నాలుగేళ్ళ అనుభవం సంపాదించిన తర్వాత అయితే అబ్బాయిలు జీతాల్లో జెట్ వేగంతో దూసుకుపోతున్నారు.

పురుష టెకీలు మహిళ టెకీల కన్నా 50 శాతం ఎక్కువ

ఏడు నుంచి పదేళ్ళ అనుభవం వచ్చాక పురుష టెకీలు మహిళ టెకీల కన్నా 50 శాతం ఎక్కువగా జీతాలు అందుకుంటున్నారు.

ప్రారంభ సగటు వేతనం ఇంచుమించు సమానం

ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఐటీ రంగంలోని అమ్మాయిలు, అబ్బాయిల ప్రారంభం సగటు వేతనం ఇంచుమించు సమానంగా ఉందని ఆ సర్వే తెలిపింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీనీ లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ పొందవచ్చు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Even as IT sector stands male-dominated, when it comes to starting salaries women earn at par or more than their male counterparts, according to a recent survey.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot