Home
News

గ్రహాంతరవాసులతో ముప్పు : వెయ్యేళ్లలో మానవజాతి అంతం

By Hazarath

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా భూగోళంపై వినాశనం తప్పదని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్ర్తవేత్త ష్టీఫెన్ హాకింగ్ అన్నారు. దీని ప్రభావం కారణంగా వెయ్యి నుంచి పదివేల సంవత్సరాల మధ్యలో మానవజాతి నశించి పోతుందని ఆయన హెచ్చరించారు. అణు యుద్ధం పలు వైరస్ లలో జన్య మార్పిడి వల్ల కాని ఇతర కారణాల గానీ ఈ వినాశనం తప్పదని ఆయన తాజాగా పేర్కొన్నారు. మిగతా న్యూస్ స్లైడర్‌లో..

Read more : నివ్వెరపరిచే నిజాలు: చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు

భూగోళంపై మానవ జాతి మనుగడ

భూగోళంపై మానవ జాతి మనుగడ

భూగోళంపై మానవ జాతి మనుగడ వెయ్యి ఏళ్ల నుంచి పదివేల ఏళ్ల మధ్య ముగిసిపోతుందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినంత మాత్రాన మానవ జాతి నశించి పోదని, మరో ఉపగ్రహంపై కాలనీలు ఏర్పాటు చేసుకొని మనుగడ సాగించగలదని ఆయన చెప్పారు.

అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు

అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు

అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు ఏర్పార్చుకోవడానికి ఇంకా వందేళ్లకుపైగా పట్టవచ్చని అన్నారు. ఈలోగా రానున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు.

భూగోళంపై మానవ మనుగడ నశించి పోవడానికి

భూగోళంపై మానవ మనుగడ నశించి పోవడానికి

భూగోళంపై మానవ మనుగడ నశించి పోవడానికి సాంకేతికరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులే వినాశనానికి దారితీయవచ్చని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. మానవుడు తన మేధస్సు ద్వారా సృష్టించిన వాటి ద్వారానే మన నాశనం సంభవించబోతున్నది తేల్చారు.

ఆర్టిఫిషల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల

ఆర్టిఫిషల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల

ఆర్టిఫిషల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల భూమి మీద మానవ మనుగడకు ముప్పు ఏర్పడవచ్చని ఆయన గతేడాదే చెప్పిన విషయం తెల్సిందే. అణు యుద్ధం వల్లగానీ, భూతాపోన్నతి కారణంగాగానీ, వివిధ వైరస్‌లలో జన్యుమార్పిడి కారణంగాగానీ భూగోళంపై మానవ మనుగడ సాధ్యం కాకుండా పోతుందని ఆయన తాజాగా చెప్పారు.

అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల

అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల

ఆటోమేషన్ ఆయుధాలు కూడా భవిష్యత్ వినాశన ఆయుధాలుగా మారవచ్చన్నారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు.

అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు

అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు

అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు అమెరికా స్థానికులకు సంభవించిన లాంటి పరిస్థితులే గ్రహాంతర వాసుల వల్ల మనకూ కలగవచ్చన్నది ఆయన అభిప్రాయం. గ్రహాంతరవాసులు కచ్చితంగా ఉంటారని విశ్వసించే స్టీఫెన్ హాకింగ్ ప్రస్తుతం వారిని కనుగొనే ప్రయత్నాల్లోనే ఉన్నారు.

ప్రపంచంలోకెల్లా రెండు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల ద్వారా

ప్రపంచంలోకెల్లా రెండు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల ద్వారా

హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రపంచంలోకెల్లా రెండు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల ద్వారా ఆయన గ్రహాంతరవాసులను వెతుకుతున్నారు. ఇటీవలనే 74వ ఏట ప్రవేశించిన స్టీఫెన్ హాకింగ్‌ను వార్శిక రీత్ స్నాతకోత్సవం కోసం బీబీసి ఆయన ఉపన్యాసాన్ని రికార్డు చేసింది. దీనిని ఈ నెల 26వ తేదీని బిబీసీ రోడీయో4లో ప్రసారం చేయనున్నారు.

ఇక ప్రపంచంలో ‘యురేకా’ అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని

ఇక ప్రపంచంలో ‘యురేకా’ అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని

ఇక ప్రపంచంలో ‘యురేకా' అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని, ఇప్పటికే కనుగొన్న శాస్త్ర విజ్ఞాన మూల సూత్రాల ప్రాతిపదికనే భవిష్యత్తు పరిస్థితులను ఊహించి ఎదురయ్యే ముప్పులకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడమే ఉత్తమ మార్గమని చెప్పారు.

శాస్త్రవిజ్ఞాన అభివృద్ధినీ అడ్డుకోలేమని

శాస్త్రవిజ్ఞాన అభివృద్ధినీ అడ్డుకోలేమని

కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషల్ బ్రెయిన్)కు దారితీసిన శాస్త్రవిజ్ఞాన అభివృద్ధినీ అడ్డుకోలేమని, దాన్ని తిరోగమన మార్గాన్ని పట్టించలేమని చెప్పారు. రానున్న ముప్పును ముందుగానే పసిగట్టి ఆ ముప్పుకు కారణమయ్యే పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోవడం ఒక్కటే మార్గమని చెప్పారు.

ఈ విశ్వాంతరాల్లో మానవులకన్నా ముందే గ్రహాంతరవాసులు

ఈ విశ్వాంతరాల్లో మానవులకన్నా ముందే గ్రహాంతరవాసులు

ఈ విశ్వాంతరాల్లో మానవులకన్నా ముందే గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉన్నందున శాస్రవిజ్ఞాన రంగంలోనే కాకుండా ప్రజాస్వామ్య విలువలపరంగా కూడా వారు మనకన్నా ముందే ఉండే అవకాశం ఉంది. అందుకని మనకన్నా వారే ఎక్కువ హేతువాదులు కావచ్చని కూడా స్టీఫెన్ అన్నారు.

ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని సర్ప్రైజ్లు

ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని సర్ప్రైజ్లు

ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని సర్ప్రైజ్లు కూడా చెప్పారు! మానవ మనుగడకు ఇన్ని దరిద్రాలు ముంచుకొస్తున్నా మనకోసం మరెన్నో అవకాశాలు కూడా ఉన్నాయని సెలవిచ్చారు. మానవ జాతికి భూమిపై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైన ఇతర ఉపగ్రహాలపై హ్యాపీగా ఉండొచ్చట.

అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని

అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని

అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని అయితే ఈ నివాస పరిస్థితులకు వందేళ్లకుపైగా పట్టవచ్చని హ్యాకింగ్ అంచనా వేశారు. ఇక్కడ కూడా మళ్లీ షాక్ ఇచ్చారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల భూమిపైనే కాదు ఇతర గ్రహాల్లో కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదట.

స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు జరుగుతాయా

స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు జరుగుతాయా

మరి ప్రపంచంలో సుప్రసిద్ధమైన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు జరుగుతాయా లేదా అన్నది ముందు ముందే చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Stephen Hawking: Humans at risk of lethal ''own goal ''
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X