ఓ అనాథ 30 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడంటే నమ్మగలరా..?

Written By:

ప్రపంచంలో టెక్నాలజీ అంటే మాదేనంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పిన ఆపిల్ కంపెనీ గురించి అందరికీ తెలుసు..అయితే దాని స్థాపించిన అధినేత జీవితం వెనుక దాగున్న కఠోర వాస్తవాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆపిల్ అనే మహా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు స్టీవ్ జాబ్స్ జీవితం ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. ఆయన జీవితం వెనుక దాగున్న విషాదపు నిజాలను మీకు తెలిపే ప్రయత్నం చేస్తోంది గిజ్‌బాట్.

Read more: ఆపిల్ బంఫర్ ఆఫర్: నెలకు రూ. 999 చెల్లిస్తే ఐఫోన్ మీ చేతికి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

జీవితమంటే ఏంటో తెలియక ఓ అనాధాశ్రమంలో తన జీవితాన్ని గడుపుతున్న అనాధ బాలుడు 30 ఏళ్లకే ప్రపంచాన్ని శాసించే సంస్థకు అధినేత అవుతాడని మీరు కలలోనైనా ఊహించగలరా..కోట్లకు వారసుడు అవుతారంటే నమ్మగలరా.. కాని అయ్యాడు అతడే స్టీవ్ జాబ్స్.

2

1955 ఫిబ్రవరిలో జన్మించిన స్టీవ్ జాబ్స్ కు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అనాధాశ్రమంలో ఓనమాలు దిద్దుకున్న ఈ పిల్లవాడిని పాల్‌ జాబ్స్‌-క్లారా జాబ్స్‌ దంపతులు దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. స్టీవ్ జాబ్స్ అసలు పేరు స్టీవ్ పాలిస్, దత్తత తల్లిదండ్రులు పెట్టిన పేరు స్టీవ్ పాల్ జాబ్స్.

3

1972లో హైస్కూలు విద్యను పూర్తి చేసిన జాబ్స్ కాలేజి చదువుకు మధ్యలోనే స్వస్థి చెప్పి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. అటారీ ఇన్‌కార్పొరేషన్‌లో చిన్న ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

4

ఇక్కడే తన చిన్ననాటి మిత్రుడు వోజ్నియాక్‌తో పరిచయం ఆపిల్ అనే మహా సామ్రాజ్యానికి దారి తీసింది. ఇద్దరూ ఆపిల్ పెట్టక ముందు 1975లో జాబ్స్‌ ఇంటిలోని కార్‌గ్యారేజిలో పర్సనల్‌ కంప్యూటర్లపై తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

5

అయితే వీరి పని తనానికి మెచ్చి ఆ సంవత్సరాంతంలోనే మౌంటెన్‌వ్యూలోని బైట్‌ షాప్‌ నుంచి 50 అసెంబుల్డ్‌ పర్సనల్‌ కంప్యూటర్లకు ఆర్డర్‌ వచ్చింది. దీంతో స్టీవ్‌జాబ్స్‌ మరో ఇద్దరితో కలిసి 1976 ఏప్రిల్‌ 1న 'యాపిల్‌ కంప్యూటర్స్‌'ను స్థాపించాడు.

6

పేరు ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న తరుణంలో జాబ్స్‌ తనకు అత్యంత ఇష్టమైన పండు పేరునే కంపెనీ పేరుగా నిర్ణయించుకుని, లోగోలో బైట్‌ని కూడా సూచించడానికిగాను పూర్తి యాపిల్‌ని కాకుండా కొరికిన యాపిల్‌ని ఉపయోగించాడు.

7

అదే సంవత్సరంలో సింగిల్‌ బోర్డ్‌ కలిగిన యాపిల్‌-1 కంప్యూటర్‌ ను విడుదల చేశాడు. కేవలం ఆన్‌బోర్డు రామ్‌ మాత్రమే కలిగివున్న ఈ కంప్యూటర్‌కి వీడియో ఇంటర్‌ఫేస్‌ (టీవీని మోనిటర్‌గా కనెక్ట్‌ చేసుకోవడానికి), ఎక్స్‌టర్నల్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ మాత్రమే వుండేవి. పూర్తిగా అసెంబిల్డ్‌ మదర్‌బోర్డుతో తయారైన ఒకే ఒక పర్సనల్‌ కంప్యూటర్‌ ఇది.

8

ఇదే తొలితరం కంప్యూటర్‌గా ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. విచిత్రం ఏమిటంటే దీని స్పీడు ఇప్పడు ఉన్న ఐ ప్యాడ్ కన్నా వెయ్యి రెట్లు స్లో. కాని ఐ ప్యాడ్ ధర కన్నా 425 రెట్లు అధికంగా అమ్ముడు పోయింది. ఎందుకంటే ఇది మొట్ట మొదటి కంప్యూటర్ కావడమే ప్రధాన కారణం.

9

ఈ కంప్యూటర్ ధర అప్పట్లో 2,10,000 అమెరికన్ డాలర్లు. కేవలం 200 కంప్యూటర్లను మాత్రమే తయారుచేశారు. అది దీన్ని ప్రముఖ వేలం సంస్థ లండన్ లో వేలం వేయగా 1,33,250 పౌండ్ల (దాదాపు 2,10,000 అమెరికా డాలర్ల) వెల పలికింది. 1977లో దీని తయారీని నిలిపివేశారు.

10

1977లో యాపిల్‌-2 కంప్యూటర్‌ను విడుదల చేశారు. అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి పర్సనల్‌ కంప్యూటర్‌ ఇదే. ఆ రోజుల్లోనే యాపిల్‌-2పై సుమారు 16వేల అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లు తయారయ్యాయంటే జాబ్స్‌ ఏ స్థాయిలో ప్రోగ్రామర్లను ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

11

అయితే అదే సంవత్సరం జాబ్స్‌ వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకుని, ఛైర్మన్‌ బాధ్యతలను ఇంటెల్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేసిన మైక్‌ మార్కులాకు అప్పగించాడు. తను తర్వాతితరం పర్సనల్‌ కంప్యూటర్‌ మాకింతోష్‌ తయారీలో నిమగ్నమయ్యాడు.

12

1980లో పబ్లిక్‌ లిమిటెడ్‌గా మారిన యాపిల్‌, తన యాపిల్‌-3 మోడల్‌ని విడుదలచేసింది. అయితే దానిలో సమస్యలు రావడంతో మైక్‌ మార్కులా ఛైర్మన్‌ పదవినుంచి తప్పుకుని తిరిగి జాబ్స్‌కి అప్పగించాడు.

13

1983 చరిత్రలో ఆపిల్ పేరు మారుమోగిన రోజు. మ్యాకింతోష్ కంప్యూటర్‌తో టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకున్న రోజు. నాటికి, నేటికి మ్యాక్‌ అనే పేరు నూతనత్వానికి, సరికొత్త ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిపోయిందంటే ఆ కంప్యూటర్ గొప్పతనం గురించి వేరు చెప్పనక్కరలేదు.

14

అయితే ఇదే సంవత్సరం ఆపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ని బయటకు పంపింది. స్టీవ్ జాబ్స్ చేత నియమించ బడిన జాన్ స్కెల్లీకి స్టీవ్ జాబ్స్ కు మధ్య జరిగిన ఆధిపత్య పోరులో మెంబర్లు జాన్‌స్కల్లీనే కే ఓటు వేయడంతో స్టీవ్‌ యాపిల్‌ను వదలక తప్పలేదు.

15

ఆపిల్ ను వదిలినా కృంగి పోకుండా 'నెక్ట్స్‌ సాఫ్ట్‌వేర్‌' సంస్థని ప్రారంభించాడు. 1986లో జార్జి లూకస్‌ నుంచి పిక్సర్‌ యానిమేషన్‌ స్టూడియోని కొనుగోలుచేసి, చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాడు. 1989లో నెక్ట్స్‌ అద్భుతమైన కంప్యూటర్‌ని తయారుచేసినప్పటికీ అత్యధిక ధర కలిగిన ఆ కంప్యూటర్‌ అసలు అమ్ముడుపోలేదు.

16

అయితేనేమి ఆ కంప్యూటర్ తో పనిచేసిన చిత్రాలకు అత్యుత్తమ అవార్డులు వరించాయి. పిక్సర్ నుంచి వచ్చిన టిన్‌ టారు' యానిమేషన్‌ చిత్రం, టారు స్టోరీ-2, ఎ బగ్స్‌ లైఫ్‌, మోన్‌స్టర్స్‌ వంటి చిత్రాలు 1.2 బిలియన్‌ డాలర్ల పైగా వ్యాపారం చేసాయి.

17

అయితే అప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఆపిల్ సంస్థను మళ్లీ గట్టెక్కించాలని స్టీవ్ జాబ్స్ కు పిలుపు రావడంతో 1999లో మళ్లీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నష్టాలలో మునిగివున్న యాపిల్‌ని తిరిగి లాభాల బాటలోకి తీసుకొచ్చి, గత దశాబ్దపు సంచలన ఉత్పత్తి అయిన 'ఐమ్యాక్‌'ని విడుదల చేయడం ద్వారా తిరిగి వెలుగులోకి వచ్చాడు.

18

ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఐ ఫోన్‌తో పెద్ద ప్రభంజనాన్నే సృష్టించాడు. ఐఫోన్‌ ద్వారానే యాపిల్‌ అతిపెద్ద అమెరికన్‌ కార్పొరేషన్‌గా అవతరించింది. ఐట్యూన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను, మ్యూజిక్‌ ప్లేయర్‌ను కనుగొనడం ద్వారా 2000 సంవత్సరంలో దివాలా తీసే స్థితిలో వున్న యాపిల్‌ సంస్థకు స్టీవ్‌ తిరిగి ఊపిరిలూదాడు.

19

ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సంస్థను నడిపిన వ్యక్తి యాపిల్‌ కంప్యూటర్స్‌ చీఫ్‌ స్టీవ్‌జాబ్స్‌ జీతం ఎంతో తెలుసా? కేవలం ఒక్క డాలర్‌ మాత్రమే. 2008 నుంచి 2010 మధ్యలో మూడేళ్ల పాటు ఆయన తీసుకున్న జీతం కేవలం ఒక డాలర్‌.

20

అందుకు కారణం కూడా ఉంది. 2008-09లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో తాను వేతనం తీసుకోరాదని, సంవత్సరానికి కేవలం 1 డాలర్‌ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏడాదికి ఒక డాలర్‌ మాత్రమే జీతం తీసుకుని సంస్థను నడిపాడు.

21

క్లోమ సంబంధ క్యాన్సర్‌తో పోరాడుతున్నావని ఆరు వారాల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పడంతో స్టీవ్ జాబ్స్ తీవ్ర నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు. అయినా తనలోనే దాచుకుని కంపెనీ నుంచి తనకు పూర్తి స్థాయి విశ్రాంతి కల్పించాలని బోర్డు సభ్యులకే లేఖ రాసి అందర్నీ విస్మయానికి గురిచేశారు స్టీవ్ జాబ్స్. రాజీనిమాని బలవంతగా ఆమోదింపజేసుకుని పగ్గాలు టిమ్ కుక్ కి అప్పగించారు.

22

1991లో లారెన్స్‌ పావెల్‌ని వివాహమాడిన జాబ్స్‌కి ముగ్గురు పిల్లలు. 1985లో 'నేషనల్‌ టెక్నాలజీ మెడల్‌', 1989లో 'ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది డికేడ్‌' వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ఆయన్ను ఓ దశాబ్దపు సిఇఒగా ప్రకటించింది.

23

'కంప్యూటర్‌ యుగం తొలిరోజుల్లోనే ఈ రంగంలో అడుగుపెట్టడం నా అదృష్టం. ఆ రోజుల్లో వ్యక్తులు ఈ రంగంపై ప్రేమతో పనిచేశారు కానీ, డబ్బు కోసం కాదంటూ కొత్త పాఠాలు నేర్పిన స్టీవ్ జాబ్స్ అక్టోబర్ 5 2011న తిరిగి రాని లోకాలకు పయనమ్యారు.

24

థింక్‌ డిఫరెంట్‌' అనే నినాదంతో ప్రపంచ కంప్యూటర్‌ చరిత్రలో ఆపిల్ అనే ఓ సామ్రాజ్యాన్ని స్థాపించిన స్టీవ్ జాబ్స్ అప్పటికీ ఇప్పటికీ చరిత్రలో మరచిపోలేని వ్యక్తి. అనాధగా ప్రపంచానికి పరిచయమై ప్రపంచమంతా ఆప్తులను సంపాదించుకున్న ఒకే ఒక్క మహనీయుడు.

25

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Steve Jobs Making of an iCon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot