దొంగిలించిన ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మారు!

Posted By:

దొంగిలించిన మొబైల్ ఫోన్‌లను విక్రయించిన ఘటనలో విచారణకు సహకరించాలని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌‌కు ఢిల్లీ పోలీసుకు నోటీసులు జారీ చేసారు. ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ పేరు మీద ఈ నోటీసును ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. జూలై నెలలో హాంకాంగ్ నుంచి వచ్చిన 600కు పైగా హైఎండ్ మొబైల్ ఫోన్‌ల షిప్‌మెంట్‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో నుంచి 6గురు వ్యక్తులు దొంగిలించారు.

Read More : కాంతితో పనిచేసే మెమరీ చిప్

ఎస్‌వీఎస్ లాజిస్టిక్స్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.కోటి విలువ చేసే ఫోన్‌లను రికవరీ చేసారు. ఈ ట్రేస్ అయిన ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించారని తేలటంతో విచారణకు సహకరించాలని ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ పోలీసుకు నోటీసులు ఇచ్చారు.

Read More : మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు

ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోకుండా ఎలా విక్రయించారంటూ ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌ ఈ విషయం పై స్పందిస్తూ తమకున్న 40,000కు పైగా సెల్లర్‌లలో ఏ ఒక్కరైన తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్ఫత్తులను విక్రయించినట్ల తేలితే వారి పై కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

మనకు కావల్సిన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్‌లో సునాయాసంగా దొరుకుతాయి.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా కావల్సిన ధర వేరియంట్‌లలో వస్తువులు అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ బోలెడంత సమయంతో డబ్బును ఆదా చేస్తుంది.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ లో వుస్తువల ఎంపికకు సంబంధించి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు


ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో బెస్ట్ డీల్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ నెటిజనులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఈబే వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు కొనుగోలుదారులకు రక్షణాత్మక ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా అరుదైన వస్తువులను సైతం సులువుగా వెతికిపట్టుకోవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు


ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా ఒక్కోసారి నాణ్యాతా లోపాలతో కూడిన ఉత్పత్తులు తమకు డెలివరీ అవుతున్నాయంటూ పలువురు నెటిజనులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు


కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ స్టోర్‌లతో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా లభిస్తుంటాయి. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా వస్తువును ఎంపిక చేసుకునే క్రమంలో సదరు వస్తువు ఖరీదు ఆఫ్‌లైన్ మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులకు సంబంధించి వారంటీ విషయంలో పలువురు వినియోగదారుల్లో ఇప్పటికి సందిగ్థత వాతావరణం నెలకుంది.

ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులను రిటర్న్ చేసే క్రమంలో చాలా తొలనొప్పులు ఎదుర్కోవటం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot